NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో సరికొత్త సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ కనుగొన్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అవే మూలాధారాలని సీబీఐ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రిని సీబీఐ విచారణకు పిలవడం బహుశా ఇదే మొదటిసారి. అయితే, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం సీబీఐ సమన్లపై ఇంకా స్పందించాల్సి ఉంది. గతంలో మాత్రం లిక్కర్ స్కాం లాంటిదేమీ లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మంత్రి మోడీని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శిస్తున్నందునే, కక్షతో వేధిస్తున్నారని ఆప్ విమర్శిస్తోంది. ఆప్‌కు చెందిన ఏ ఒక్క నాయకుడు ఇలాంటి ఆరోపణలకు భయపడేది లేదని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. చాలా మంది ఆప్ మంత్రులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని గతంలో కూడా వేధించారు. మోడీకి, అవినీతికి వ్యతిరేకంగా, మా పోరాటం ఆగదని, కొనసాగుతుందని ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు.

జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలిన పాదచారుల వంతెన.. 80 మందికి గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని ఉదమ్‌పూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాదచారుల వంతెన కుప్పకూలిన ఘటనలో 80 మందిగాయాలపాలయ్యారు. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగమ్‌లో బైసాఖి వేడుకల సందర్భంగా పాదచారుల వంతెన కూలిపోయిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినోద్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు పాదచారుల వంతెనపైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు డివిజినల్‌ కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనలో దాదాపు 80 మంది గాయపడ్డారని చెనాని మునిసిపాలిటీ ఛైర్మన్‌ మాణిక్ గుప్తా తెలిపారు. వారిలో 20-25 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. తాము 6-7 మందిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు.

బీసీల కోసం రెండులక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి

కేంద్రంలో ప్రత్యేకంగా బీసీలకోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్.కృష్ణయ్య. విజయవాడలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కేంద్రం బీసీల కోసం ప్రత్యేకంగా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. మత్స్యకారులు, వడ్డెర, యాదవ వంటి బీసీ కులాలకు కేంద్రప్రభుత్వం ఆర్థికంగా మరింత చేయూతనివ్వాలి..కాలక్రమేణా యాంత్రికరణతో కులవృత్తులన్నీ మరుగున పడ్డాయి..మరుగున పడ్డ కుల వృత్తులకు ప్రత్యామ్నాయంగా ఇతర పనులు చూపాలని ఆయన అన్నారు. 60శాతం మ్యాపింగ్ గ్రాంట్ ఇవ్వాలి..బీసీలను పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలి..75 సంవత్సరాల తర్వాత కూడా బీసీల వాటా బీసీలకు ఎందుకు ఇవ్వరు..అన్ని రాష్ట్రాల్లోని బీసీలను ఏకం చేస్తాం..4లక్షలమందితో పార్లమెంట్ ను ముట్టడిస్తాం..చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. వైసీపీకి సేవ చేయకపోయినా బీసీల కోసం పోరాడుతున్నందుకు నాకు సీఎం జగన్ నాకు ఎంపీ పదవి ఇచ్చారు..దేశంలో 65శాతం పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే. మంత్రివర్గంలోనూ బీసీలకు పెద్దపీట వేసారు..

ఎన్టీఆర్ తులసివనం…చంద్రబాబు గంజాయి మొక్క

టీడీపీ అధినేత, మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్టీఆర్ తులసీ వనం..చంద్రబాబు గంజాయి మొక్కగా ఎన్టీఆర్ కుటుంబంలో చేరాడు.గుడివాడ లో ఎక్కడైనా చంద్రబాబు తో చర్చకు సిద్ధం..గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశాడో, వైఎస్సార్, జగన్ హయాంలో నేనేం చేశానో చర్చకు సిద్ధం అన్నారు నాని. అధికారంలో ఉండగా గుడివాడను గాలికి వదిలేశాడు..నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టింది నేను, జూనియర్ ఎన్టీఆర్ .అత్తారింటికి ఎవరైనా భార్యతో వెళతారు. చంద్రబాబు ఎవరితో వెళ్ళాడు?హరికృష్ణ ఇంటి తాళాలు కూడా తీయలేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా నిమ్మకూరులో బస్సులో పడుకున్నాడు.. నందమూరి హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో నిమ్మకూరును అభివృద్ధి చేశాడు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరు మీద ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తులు కేవలం హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మాత్రమే. 42 ఏళ్ల తర్వాత, అత్తారింటికి నిమ్మకూరు వచ్చి చంద్రబాబు బస్సులో నిద్రించాల్సి వచ్చింది. చంద్రబాబు నిద్రించడానికి నిమ్మకూరులో ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు .క్యాసినో పెట్టి అవినీతి చేసి ఉంటే సీబీఐ, ఈడీ లాంటివి నన్ను వదిలేస్తాయా??ఆధారాలు లేని ఆరోపణలు ఎందుకు అన్నారు కొడాలి నాని.

ప్రభుత్వ బంగ్లాను ఖాళీచేసిన రాహుల్ గాంధీ

అనర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్‌సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు చేపట్టింది. అనర్హత వేటు పడింది. ఏప్రిల్ 22లోగా రాహుల్ తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ గతంలోనే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన బంగ్లాను ఈరోజు ఖాళీ చేశారు. ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు.ఇల్లు ఖాళీ చేయడానికి ఏప్రిల్ 22 వరకు గడువు ఉంది.ఇల్లు ఖాళీ చేసేందుకు అంగీకరించిన రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతలు ఇంటి ఆఫర్లతో స్వాగతించారు. మా ఇంట్లో ఉండాలంటూ స్వాగతం పలికారు. 52 ఏళ్ల కాంగ్రెస్ మాజీ చీఫ్ కార్యాలయం బదిలీ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ జన్‌పథ్ నివాసానికి మారుతున్నట్లు చెప్పారు. ఈ ఇల్లును అప్పగించడానికి కొంత సమయం పడుతుందని, నిర్ణీత తేదీ కంటే ముందే పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకుడి కార్యాలయం తెలిపింది.

భారీవుడ్ సినిమాలు.. ఆతృతగా చూస్తున్న అభిమానులు

ఒకప్పుడు బాలీవుడ్‌లో రూ.100కోట్లు లేదా రూ.200కోట్లకు మించి బడ్జెట్ ఉండే సినిమాలు ఒకటి రెండు మాత్రమే. అయితే ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి ఇండస్ట్రీలో చాలామంది పోటీ పడుతున్నారు. రాబోయే కొద్ది నెలల్లో బాలీవుడ్‌లో 100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలు.. ఒకటి రెండు కాదు చాలా విడుదల కాబోతున్నాయి. ఈ జాబితాలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, ‘బాహుబలి’ ప్రభాస్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని వారి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనే, ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల నుండి రూ.1000 కోట్ల వరకు ఉండనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు.ప్రభాస్, కృతి సనన్‌ల మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదిపురుష్’ చాలా కాలంగా చర్చల్లో ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా ఖరీదైనది. అయితే ఈ సినిమా పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుంచి మేకర్స్ కు కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.

చీటికీ మాటికీ మీ పిల్లలు ఏడుస్తున్నారా?

పిల్లలు ఎప్పుడు అలా ఉంటారో చెప్పలేం. ఆడుకునే పిల్లలు చిన్న చిన్న వస్తువులను కోసం పెద్దగా ఏడుస్తుంటారు. కొంతమంది పిల్లలు ఏడవడానికి కారణం అవసరం లేదు. కళ్లలో ఇంత నీళ్లొచ్చాయా అనే విధంగా ఏడ్చే పిల్లలు ఉన్నారు. అలోకే స్టార్ట్ అనగానే కళ్లలో నుంచి నీళ్లు కారడం మొదలవుతుంది. చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా.. కొందరు పిల్లలు ఏడుపుకు అలవాటు పడుతున్నారు. కోరుకున్నది లభించక పోయినా ఏడ్చేవారు, తల్లితండ్రులు కళ్లు కొంచెం పెద్దవి చేసినా ఏడుస్తారు. తల్లిదండ్రులు ఈ పిల్లలను కొట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఏమనకున్నా.. కొట్టినట్లు పిల్లలు ఏడ్వడం మీరు చూడవచ్చు. అయితే.. పిల్లలు తరుచూ ఏడవడం అనేది వారి ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చు. అయితే.. వీలైనంత త్వరగా వారిలో ఈ అలవాటు మాన్పించే ప్రయత్నం చేయాలి.పిల్లలు పదే పదే ఏడవడానికి చాలా కారణాలున్నాయి. మీ పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే, మీరు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా వారిని సరైన మార్గంలో ఉంచడానికి ప్రయత్నించవచ్చు.

దేశంలో కొత్త నడవడికను సీఎం కేసీఆర్ మొదలుపెట్టారు

అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడలేకపోతునందుకు శింతిస్తూ హిందీలోనే మాట్లాడతానని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా అని ఆయన అన్నారు. దేశంలో కొత్త నడవడిక ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘అంబేద్కర్ జయంతి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రత్యేకంగా నిర్వహించారు. మనం యుద్ధం చేయాలి ప్రజల్లో మార్పుకోసం, వ్యవస్థలో మార్పు కోసం, దేశంలో మార్పు కోసం. దేశంలో ఆర్థిక ఇబ్బందుల పై ఎలా పోరాటం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త దిశ చూపించారు. దేశంలో ఆర్థిక అసమానతలపై ఆనాడే అంబెడ్కర్ ఫైట్ చేశారు.అంబేద్కర్ స్పూర్తితో మళ్ళీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని కాపాడేందుకు ఫైట్ చేసేందుకు కేసీఆర్ దిశ మొదలుపెట్టారు. దేశంలో ఒక్క రిలీజియస్ మైనార్టీ మాత్రమే లేదు…కమ్యూనిటీ మైనార్టీ కూడా ఉంది.రిలీజియస్ మైనార్టీ తరహాలో…కమ్యూనిటీ మైనార్టీ ఉందని ఆనాడే అంబెడ్కర్ చెప్పారు. అంబేద్కర్‌ తెచ్చిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దళితబందు పథకం మంచి పథకం. ఈ దేశంలో గొప్పుడు గొప్పగా..పేదోడు పేదోడిగానే ఉంటాడు. దళితబంధు ఫలితం రానున్న రోజుల్లో తెలుస్తుంది. దళితబంధు ఇవ్వాళ కేసీఆర్ స్టార్ట్ చేశారు…రానున్న రోజుల్లో మరో ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తారు చేయాలని కోరుకుంటున్నా.

ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌.. ఫొటోలు వైరల్
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ జెస్సికా జోనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వేర్న్‌ను వివాహం చేసుకుంది. పదేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న ఈ ప్రేమికుల జంట ఏప్రిల్‌ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జెస్సికా జోనాసెన్- సారా వేర్న్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ మేరకు జోనాసెన్ తాజాగా తన :సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.సారా – జోనాసెన్‌లు చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2018లో వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. వాస్తవానికి 2020లో ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించినా కరోనా కారణంగా అది వాయిదాపడింది. ఈ మధ్యకాలంలో జోనాసెన్ కమిట్‌మెంట్స్ వల్ల ఆమె పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్సికా జోనాసెన్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘‘సర్‌ప్రైజ్‌! థర్డ్‌టైమ్‌ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్‌ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని జెస్సికా ట్వీట్‌ చేసింది.