NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

హుకుంపేటలో విషాదం… గోతిలోపడి బాలుడి మృతి

అల్లూరి జిల్లా హుకుంపేటలో విషాదం నెలకొంది. నేషనల్ హైవే పనుల్లో భాగంగా తీసిన గోతిలో పడి బాలుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు కారణంగా చెరువులా మారింది గొయ్యి…నిన్న సాయంత్రం ఈతకు వెళ్ళిన మజ్జి జ్ఞాన దీపక్ అనే కుర్రాడు గోతిలో పడి మరణించాడు. మజ్జి జ్ఞాన దీపక్ 5వతరగతి చదువుతున్నాడు. గోతి వద్ద చెప్పులు,బట్టలు ఆధారంగా మృత దేహాన్ని వెతికి తీశారు స్థానికులు. నిర్లక్ష్యంగా హైవే పనులు చేయడం కారణంగానే తమ పిల్లవాడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి దిబ్బ పాలెం గ్రామంలో విషాదం
అనకాపల్లి దిబ్బ పాలెం గ్రామంలో విషాదం ఏర్పడింది. డిగ్రీ విద్యార్థి ప్రాణాలు తీసింది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్. క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ ఒత్తిడి తెచ్చాడు క్రికెట్ బుకీ…సుమారు రూ. లక్షా వరకు అప్పు చేశాడు మృతుడు మధు కుమార్ (20). ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మధు కుమార్..ఈనెల 23వ తేదీన ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు మధుకుమార్. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏపీలో పలువురు డీఎస్సీల బదిలీలు

ఏపీలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేశారు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి. 77 మంది డిఎస్పిల ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దిశ డిఎస్పీ వాసుదేవన్.. పుట్టపర్తి డిఎస్పీ గా బదిలీ..కడప డిఎస్పీ బి.వి.శివారెడ్డి.. అనంతపురం రూరల్ డిఎస్పీ గా బదిలీ చేశారు. జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు.. ఏసీబీ డిఎస్పీ గా బదిలీ అయ్యారు. కడప ఏసీబీ డిఎస్పీ కంజక్షన్ హిందుపురం డిఎస్పీ గా బదిలీ చేశారు. తిరుపతి డిటిసి డిఎస్పీ ఎండి షరీఫ్ కడప డిఎస్పీ గా నియమించారు. ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్. పులివెందుల డిఎస్పీ గా నియమించారు. తాడిపత్రి డిఎస్పీ చైతన్య కుమార్.. రాజంపేట డిఎస్పీ గా నియమించారు. సత్యసాయి జిల్లా ఎస్బి డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి జమ్మలమడుగు డిఎస్పీ గా నియమించారు. ఒంగోలు డీఎస్పీగా టి.అశోక్ వర్ధన్..మార్కాపురం డీఎస్పీగా జి.వీర రాఘవరెడ్డి నియామకం చేశారు. బెజవాడ సెంట్రల్ ఏసీపీగా భాస్కర రావుని నియమించారు. పశ్చిమ ఏసీపీగా జనార్ధన రావు, నందిగామ డీఎస్పీగా జనార్ధన నాయుడు, మచిలీపట్నం డీఎస్పీగా మాధవ రెడ్డి, గన్నవరం డీఎస్పీగా జయసూర్య, గుడివాడ డీఎస్పీగా శ్రీకాంత్ ని నియమించారు డీజీపీ. అలాగే అవనిగడ్డ డీఎస్పీగా మురళీధర్, విజయనగరం ఎస్డీపీవో గా కాళిదాస్..చీపురుపల్లి ఎస్డీపీవోగా చక్రవర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

12,854 ప్రదేశాలపై దాడులు… 8,950 మంది నేరస్థుల అరెస్టు

రాజస్థాన్ పోలీసులు మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 12,854 ప్రదేశాలపై దాడులు చేసి మొత్తం 8,950 మందిని అరెస్ట్ చేశారు. వాంటెడ్ క్రిమినల్స్, సంఘవిద్రోహులు, నేర కార్యకలాపాలకు పాల్పడిన ఇతర వ్యక్తులను అరెస్టు చేశారు. 18,826 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులతో కూడిన 4,143 బృందాలు 12,854 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా 8,950 మందిని అరెస్టు చేసినట్లు రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా తెలిపారు.బికనీర్ పరిధిలో 3,304 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులతో కూడిన 806 బృందాలు 2,997 చోట్ల దాడులు చేసి మొత్తం 924 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ ఎంఎన్ తెలిపారు. జైపూర్ కమిషనరేట్‌లో 3,090 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులతో కూడిన 1,029 బృందాలు 1,029 చోట్ల దాడులు నిర్వహించి మొత్తం 296 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్ లో రెడ్ అలర్ట్.. రాత్రినుంచి వర్షమే వర్షం

రాజధాని నగరం సహా తెలంగాణలోని అన్ని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా.. మరో వైపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. భారీ ఈదురు గాలులతో దంచికొట్టడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ అప్రమత్తం అయ్యి నగరంలోకి దిగింది. అయినప్పటికీ పలు ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి. హైదరాబాద్ లో రామచంద్రాపురంలో అత్యధికంగా 6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, బేగంపేట, కూకట్ పల్లి, గాజుల రామారం, మోహిదీపట్నం, మల్లేపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్ గిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాలతో, వడగండ్ల వానతో తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. మరో నాలుగు రోజుల పాటు వర్షా భావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగండ్ల వానలు పడొచ్చని చెబుతుంది. కాబట్టి.. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతుంది.

యడియూరప్ప వత్తిడిలో ఉన్నారు..జగదీష్ షెట్టర్ కామెంట్స్

రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని పిలుపునిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బిఎస్ యడియూరప్పపై జగదీష్ షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఒత్తిడి మేరకు యడియూరప్ప ఈ మాటలు చెబుతున్నారని షెట్టర్ అన్నారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుండి జగదీష్ షెట్టర్ గెలవకుండా ఉండటానికి బిజెపి నాయకులందరూ చాలా కష్టపడతారని యడియూరప్ప చెప్పగా, బిజెపి తన కుమారుడు విజయేంద్రకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే యడియూరప్ప అలాంటి ప్రకటన చేసి ఉండేవారు కాదని శెట్టర్ పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా యడియూరప్పను కలిశానని, తనకు టిక్కెట్ ఇవ్వాలని, లేకపోతే ఉత్తర కర్ణాటకలో పార్టీ 20-25 సీట్లు కోల్పోతుందని పార్టీ హైకమాండ్‌ను చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఒత్తిడి వల్లే ఆయన మాట్లాడుతున్నారని షెట్టర్ అన్నారు. హుబ్లీలో విలేకరులతో యడియూరప్ప మాట్లాడుతూ.. ”ఈ ఎన్నికల్లో మా ప్రజలకు షెట్టర్‌ను గెలిపించకూడదని.. మా అభ్యర్థిని గెలిపించాలని నేను చెప్పాను. ఇక్కడ భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తాం. షెట్టర్ గెలవకుండా ఉండేందుకు మేం చాలా కష్టపడతాం.ఈ నియోజకవర్గంలో షెట్టర్ గెలవకుండా చూస్తామని మా నాయకులందరూ ప్రమాణం చేశారు” అని చెప్పారు. జగదీష్ శెట్టర్ సొంత నియోజకవర్గం అయిన హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగింకైని పోటీకి దింపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నుంచి బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను బీజేపీ పోటీకి దింపింది. దశాబ్దాలుగా తన తండ్రికి పట్టున్న నియోజకవర్గం నుంచి విజయేంద్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

నేను నోరు విప్పితే సమంత తల ఎక్కడ పెట్టుకుంటుందో

హీరోయిన సమంత నిర్మాత చిట్టిబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత చిట్టిబాబు మరోసారి సమంత మీద మండిపడ్డారు. ఇటీవల సమంత ఆయనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కి చిట్టిబాబు కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల చిట్టిబాబు సమంతను టార్గెట్ చేశారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నాను అనేది అంతా ఓ నాటకం. సింపథీతో సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటుందని అన్నారు. ఆమె మీడియా ముందు ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరని చిట్టిబాబు అన్నారు. సమంత స్టార్ డం ఎప్పుడో పోయింది. బతకడానికి వచ్చిన ఆఫర్స్ అన్నీ రిజెక్ట్ చేయకుండా చేసుకుంటూ పోతుంది. ఆమెకు గ్లామర్ పోయింది. శాకుంతలం మూవీకి సమంతను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు ? అలాంటి పాత్ర ఆమె ఎలా చేయగలదు? అందుకే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటూ సమంత పట్ల చిట్టిబాబు అసహనం వ్యక్తం చేశాడు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందించారు. చిట్టిబాబు మీద ఒక సెటైర్ పోస్ట్ విడుదల చేశారు. చిట్టిబాబుకు చెవుల్లో వెంట్రుకలు ఉండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… జనాలకు చెవిలో వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్ లో సెర్చ్ చేస్తే… టెస్టోస్టిరాన్ అధికం కావడం వలన అని చూపించింది, అని ఒక పోస్ట్ పెట్టింది. దీనిపై చిట్టిబాబు తాజాగా స్పందించారు. సమంతను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ‘ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారు. అదే నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు.

వెంటనే ఏడ్చేస్తాను అంటున్న శింబు

బాలనటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు శింబు. కేవలం నటనే కాదు ఆయన ఆల్ రౌండర్. సింగిర్, సాహిత్యం, దర్శకత్వం ఇలా అన్నింటిలో ఆయన రాణించారు. శింబు నటనకు ప్రత్యేక అభిమానులున్నారు. ఈ మధ్యకాలంలో శింబు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ‘మనడు’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత నటుడు శింబు నటించిన ‘వెందు తానంత కాదు’, ‘పతు తాళ’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. కలెక్షన్ల రికార్డు కూడా నెలకొల్పాయి. ఈ సందర్భంగా నటుడు శింబు ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘నేను మా నాన్నగారి లాగానే చాలా ఎమోషనల్. సినిమాలో చిన్న సెంటిమెంట్ సీన్ వచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటాను. చాలా రోజుల తర్వాత స్నేహితులు కలుస్తారు. వాళ్ళు మళ్లీ తిరిగి ఊరు వెళ్ళిపోతుంటే వెంటనే ఏడుస్తాను. వాళ్లు ఎంత నచ్చజెప్పినా తట్టుకోలేను. మనమందరం ఏడుస్తూనే పుట్టాము. పదిమంది మన గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఎమోషనల్ అవుతాను. అప్పుడు మనం ఏడవకూడదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను’ అంటూ ఓపెన్ మైండెడ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

అటు అర్జున్, ఇటు గిల్.. ట్రెండింగ్ లో సారా టెండూల్కర్

ఐపీఎల్ 16వ సీజన్ లో మంగళవారం ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది. ఇలా ఎందుకున్నది అనేది ఈ పాటికే మీకు అర్థ మయి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్, సారా టెండూల్కర్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ గిల్ టీమిండియాలో పర్మినెంట్ స్థానం సంపాదించినప్పటి నుంచి సారా, గిల్ ల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే తాము మంచి స్నేహితులమని గిల్ పేర్కొన్నాడు.. కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున సారా టెండూల్కర్ సోదరుడు అర్జున్ టెండూల్కర్ మ్యాచ్ లో బరిలో ఉండడమే. మరో వైపు గుజరాత్ టైటాన్స్ తరపున శుబ్ మన్ గిల్.. ముంబై జట్టు తరపున అర్జున్ ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో సారా ఎవరికి మద్దతివ్వాలో తెలియక మ్యా్చ్ చూడడం మానేసిందని కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ లో అటు అర్జున్ టెండూల్కర్.. ఇటు శుబ్ మన్ గిల్ లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు. గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్ వేసినప్పటికి ఆ ఓవర్ లో నాలుగో బంతిని గిల్ ఎదుర్కొని ఒక పరుగుల తీశాడు. ఇక తన రెండో ఓవర్ తొలి బంతికే వృద్దిమాన్ సాహాను ఔట్ చేయడంతో అర్జున్ బౌలింగ్ లో ఆడే అవకాశం శుబ్ మన్ గిల్ కు రాలేదు.

Show comments