సైబర్ ఫ్రాడ్ లో మోసపోయిన మహిళ.. భర్త ట్రిపుల్ తలాక్
సైబర్ మోసాల పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎక్కడో చోట ప్రజలు అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తామని, లాటరీ తగిలిందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్ మోసం 15 ఏళ్ల వివాహబంధానికి తెరపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో పోగొట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కేంద్రపర జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ జమ్రున్ బీబీకి ఫేస్ బుక్ ద్వారా రవి వర్మ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం స్నేహంగా మారింది. అక్క అని పిలుస్తూ తనది జార్ఖండ్ అని, ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉంటున్నానని నమ్మించారు. ఈ మాటలను జమ్రున్ బీబీ నమ్మింది. ఈ నేపథ్యంలో ఆమెకు రూ. 25 లక్షల విలువైన బంగార కంఠహారం, ఫ్రిడ్జ్, ఐఫోన్, ఏసీ వంటి ఖరీదైన వస్తువులను పంపుతాని అని నమ్మబలికాడు. వాటిని పంపేందుకు దాదాపుగా రూ.1.70 లక్షలు కొరియర్ ఛార్జీలు అవుతాయని నమ్మించాడు. ఈ మాటలను నమ్మిన మహిళ తన నెక్లెస్ తాకట్టు పెట్టి రూ. 60 వేలు పంపింది. మరో విడతగా రూ. 1,70,000లను రవి వర్మకు అందించింది. అయితే ఈ డబ్బు అందిన తర్వాత మాట్లాడటం మానేశాడు రవివర్మ.
ఇజ్రాయిల్ పై సిరియా దాడి.. సరిహద్దు దేశాల నుంచి వరస దాడులు..
ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. అంతకుముందు రోజు ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఓ ఇటలీ టూరిస్ట్ తో పాటు మొత్తం ముగ్గురు మరణించారు. ఈ ఘటన తర్వాత ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ సైన్యం సమీకరణకు పిలుపునిచ్చారు. శనివారం రోజు సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. సిరియా భూభాగం నుంచి మూడు రాకెట్లతో దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. బుధవారం అల్ – అక్సా మసీదులో పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీని తర్వాత లెబనాన్ నుంచి పదుల సంఖ్యలో రాకెట్ దాడులు జరిగాయి. గురువారం లెబనాన్ నుండి 25 రాకెట్లను ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ అడ్డగించగా, ఐదు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దీంతో ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా స్ట్రిప్, లెబనాన్ లోని హమాస్ తీవ్రవాద స్థావరాలపై వైమానికి దాడులు జరిగాయి.
ఎమ్మెల్యేకే కౌంటరిచ్చిన మహిళ.. ఎక్కడంటే?
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈమధ్య తరచూ వార్తల్లోకి వస్తున్నారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తో వివాదం అలా ఉంచితే.. ఆయన నిత్యం జనం మధ్య తిరుగుతుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటాయి. తాజాగా ఓ మహిళతో ఆయన సంభాషణ, ఎమ్మెల్యేకి కౌంటర్ ఇచ్చిన ఆమహిళ ఉదంతం వైరల్ అవుతోంది. ధర్మవరం పట్టణం శివానగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ.. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వివరించారు. జగన్ పాలన ఎలా ఉంది? అంటూ అడిగారు. ఈ సమయంలో ఓ మహిళ మద్యం ధరలు తగ్గించాలి సార్ అని ఎమ్మెల్యేను కోరింది. “నీ భర్త తాగకుండా ఉండాలా.. లేక ధరలు తగ్గించాలా?” అని ఎమ్మెల్యే ఆ మహిళను ప్రశ్నించారు. ‘తాగకపోతే మంచిదే సార్…కానీ ధరలు కూడా తగ్గించాలి’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి తెచ్చింది. తాగి వచ్చినప్పుడు నీ భర్తకు అన్నం పెట్టవద్దు.. అని ఎమ్మెల్యే చెప్పగానే.. ‘పనిచేసే వారికి భోజనం పెట్టకపోతే ఎట్లా సార్?’ అంటూఎదురు సమాధానం ఇచ్చిందా మహిళ. ఎమ్మెల్యే కు మహిళకు మధ్య రెండు రోజుల క్రితం జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అతిగా ఆశ పడకండి.. ప్లీజ్ తినడం మానేయకండి
బరువు తగ్గడం అనేది నిరంతర ప్రక్రియ దీనికి గడువు పక్రియ అనేది ఏమీ ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు.. ఎంత శ్రద్ధగా, క్రమశిక్షణతో ఉంటే.. అంత మంచి ఫలితాలు ఉంటాయి. సరైన మార్గంలో ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడం దీర్ఘకాలంలో మీకు సహాయం చేస్తుంది. చాలా మంది తమ బరువు తగ్గించే ప్రయాణంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, అది బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. ఈ పొరపాట్లను విస్మరించడం సులభం అయినప్పటికీ, వాటిని ఎక్కువ కాలం కొనసాగిస్తే ప్రతికూల ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ తప్పులు మీ బరువు తగ్గించే ప్రణాళికను ప్రభావితం చేస్తాయి. బరువు తగ్గాలంటే.. ఎలాంటి తప్పులు చేయకూడదో చూడండి. బరువు తగ్గాలనుకునే వారు చేసే అత్యంత సాధారణ తప్పు ఇది. మీరు తినడం మానేస్తే, మీరు బరువులో మార్పును గమనించినప్పటికీ, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. సాధారణ డైట్‌లోకి వస్తే.. త్వరగా బరువు పెరుగుతారు. డైట్ తగ్గించుకుని బరువు తగ్గాలంటే.. ఆరోగ్యం, శరీరంపై దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తుంచుకోండి మరియు తగినంత ఆహారం తినండి. మీ ఆహారంలో సమతుల్య ఆహారం ఉంటే.. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు.
హల్ద్వానీ జైలులో కరోనా కలవరం
హల్ద్వానీ జైలులో కలకలం రేగింది. ఏకంగా ఓ మహిళలో పాటు 40 మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మొత్తం 44 మంది ఖైదీలు ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త జైలు అధికారుల్లో కలకలం రేపింది. నెలకు రెండు సార్లు ఆస్పత్రి నుంచి ఓ టీమ్ సాధారణ చెకప్ కోసం జైలుకు వెళ్తుంది. తేలిక పాటి సమస్యలు ఉన్న ఖైదీలందరికీ అక్కడే మందుల్ని అందచేస్తారు. తీవ్ర సమస్యలు ఉన్నవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ఇలా తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఖైదీలకు హెచ్ఐవీ నిర్థారణ అయినట్లు తెలుస్తోంది. హెచ్‌ఐవి సోకిన ఖైదీలకు సకాలంలో చికిత్స అందించడానికి జైలు పరిపాలన కూడా సాధారణ తనిఖీలను నిర్వహిస్తుంది. హెచ్‌ఐవీ రోగుల కోసం యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సుశీల తివారి ఆస్పత్రి డాక్టర్ పరమ్ జీత్ సింగ్ తెలిపారు. హెచ్ఐవీ సోకిన రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారులు ఎవరూ స్పందించలేదు.
ఓటమి తర్వాత మొహం చాటేసిన రోహిత్ శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఏడాది మెగా టోర్నీలో వరుసగా రెండో ఓటమిని ముంబై చవిచూసింది. శనివారం వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ముంబై విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకు ఓపెనర్లు రోహిత్ శర్మ ( 21), ఇషాన్ కిషన్ ( 32) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ తోకు వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కిషన్ తన దూకుడైన ఆటను కొనసాగించి పవర్ ప్లే ముగిసేసరికి తమ స్కోర్ బోర్డును 60 పరుగులు దాటించాడు. అయితే ఇషాన్ కిషన్ ఔట్ అయిన అనంతరం ముంబై పతనం మొదలైంది. వరుస క్రమంలో ముంబై ఇండియన్స్ వికెట్లు కోల్పోయింది.
పాతికేళ్ళ చిరంజీవి మూవీ.. బావగారూ బాగున్నారా?
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ తనను అభిమానించేవారిని ఆనందపరచడం కోసం శ్రమిస్తుంటారు. 1995లో ఆయన సినిమాలు నిరాశ కలిగించాయి. ఆ సమయంలో ఆయన కాసింత గ్యాప్ తీసుకొని మళ్ళీ 1997 నుండి తనదైన బాణీ పలికిస్తూ అభిమానులను అలరించారు. తొలుత ‘హిట్లర్’గా, తరువాత ‘మాస్టర్’గా మురిపించిన మెగాస్టార్ ఆ పై టైటిల్ రోల్ కాకుండా, కథకు సంబంధించిన టైటిల్స్ తో సాగాలని తలచారు. ఆ ప్రయత్నంలో తొలిగా రూపొందిన చిత్రం ‘బావగారూ…బాగున్నారా?’. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తమ్ముడు నాగబాబు నిర్మించారు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు. వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం…రా’తో పరిచయం అయిన జయంత్ కు ఇది రెండవ చిత్రం! 1998 ఏప్రిల్ 9న విడుదలైన ‘బావగారూ…బాగున్నారా’ భలేగా అలరించింది.ఇంతకూ ‘బావగారూ…బాగున్నారా’ కథ ఏమిటంటే- భారతీయుడైన రాజు న్యూజీలాండ్ లో ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. స్వదేశంలో తన చెల్లెలు పేరున ఓ అనాథశరణాలయం కూడా నిర్వహిస్తూంటాడు రాజు. స్వప్న అనే అమ్మాయి న్యూజిలాండ్ లో చదువుకుంటూ, ఆమె అంకుల్ ఇంట్లో ఉంటుంది. ఓ సందర్భంలో రాజుతో స్వప్నకు పరిచయం ఏర్పడుతుంది.
సూర్యకుమార్ చెవిలో మహీ మంత్రం
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తో మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ అనంతరం కొందరు యువ క్రికెటర్లు ధోనీ నుంచి సలహాలు తీసుకున్నారు. శనివారం వాంఖడేలో కోచింగ్ క్లాస్ కూడా జరిగింది. టీచర్ గా ధోనీ, విద్యార్థి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌పై గెలిచిన తర్వాత ధోనీ సూర్యకుమార్‌ను మైదానంలో కలిసి మాట్లాడాడు. చాలా రోజులుగా సూర్యకు పరుగులు రావడం లేదు. నంబర్ వన్ T20 బ్యాట్స్‌మన్ (ICC ర్యాంకింగ్స్‌లో) వన్డే క్రికెట్‌లో భారతదేశం తరపున ఆడాడు.. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్‌లలో మొదటి బంతికే ఔట్ అయ్యాడు. అప్పటి నుంచి అతని గురించి చాలా విషయాలు మొదలయ్యాయి. ఐపీఎల్‌లోనూ ఆ పరుగుల కరవు కొనసాగుతోంది. చెన్నైపై సూర్య కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతడిని మళ్లీ పరుగులెత్తించేందుకు ధోనీ పలు విషయాలను వివరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని సూర్యకుమార్‌తో సీరియస్‌గా మాట్లాడటం కనిపించింది. సూర్య శ్రద్ధగా వింటున్నాడు.