NTV Telugu Site icon

Top Headlines @5 PM: టాప్ న్యూస్

Top 5pm

621570e2 Caf8 4434 A1a9 Ead244eeda70

1 రాందేవ్ బాబా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం

మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసనకు దిగింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దగ్ధం చేసిన మహిళా కాంగ్రెస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మాజీ మంత్రి గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాందేవ్ బాబా వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మాట వేరే పార్టీ వాళ్ళు అన్ని వుంటే ఇప్పటికీ బత్తాయిలు , హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి ని అన్ని రచ్చ చేసేవారని అంటున్నారు. ప‌తంజ‌లి యోగా పీఠ్‌, ముంబై మ‌హిళా ప‌తంజ‌లి యోగా స‌మితి ఆధ్వర్యంలో థానేలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మ‌హిళ‌లు చీర‌ల్లో బాగుంటార‌ని, స‌ల్వార్ సూట్లలో కూడా బాగానే క‌నిపిస్తార‌ని, నా క‌ళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధ‌రించ‌కున్నా బాగుంటార‌ని బాబా రాందేవ్ నోరు జారారు. యోగా క్లాసుకు వ‌స్తున్న మ‌హిళ‌ల‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. బాబా రాందేవ్ మాటలపై రచ్చ రేగుతోంది.మహిళా సంఘాలు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పాలంటున్నాయి.

2 గిరిజనులను మోసం చేసింది సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఘట్కేసర్ మండలం అన్నాజిగూడాలోనీ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో జరుగుతున్న ఎస్టీమోర్చా శిక్షణా తరగతులకు హాజరై కేసీఆర్ వైఫల్యాల మీద ప్రసంగించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణవస్తే అందరి కంటే ఎక్కువ బాగుపడతాం అని తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారు మన గిరిజన బిడ్డలు. అలాంటివారిని తెలంగాణ రాగానే 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్త అని చెప్పి మోసం చేసిన వ్యక్తి కెసిఆర్. ఎనిమిదిన్నర సంవత్సరాలు నెపం కేంద్రం మీద నెట్టి ఎంతోమంది విద్యార్థులను చదువుకి దూరం చేసిన దుర్మార్గుడు. కానీ మునుగోడులో 33 తండాల్లో ఉన్న 13 వేల ఓట్ల కోసం ఆఘమేఘాల మీద గిరిజన రిజర్వేషన్లు ప్రకటించారు. ఎన్నికలప్పుడు మాత్రమే పని చేస్తా అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. పోడుభూముల పట్టాలు ఇస్తా అని మోసం చేసిన సీఎం.. కెసిఆర్. గుర్రంపోడు దానికి సజీవ సాక్ష్యం. అసెంబ్లీ వేదికగా ఎన్నో సార్లు కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మాటతప్పిన వాడు కెసిఆర్. ఫారెస్ట్ ఆఫీసర్ హత్యకు కారకుడు కెసిఆర్. హైదరాబాద్ చుట్టుపక్కల గుడిసెలు వేసుకుని బ్రతుకుతున్న గిరిజనుల గుడిసెలు పీకేసి ఆ భూములు పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారు. పెద్దవాళ్ళు ఇచ్చే ఎంగిలిమెతుకుల కోసం గిరిజనులను ఇబ్బందిపెడుతున్నారు. భూప్రక్షాళనపేరిట దళిత, గిరిజనుల భూములు కొల్లగొడుతున్నారు. ఊళ్ళనుండి పారిపోయిన వారు మళ్లీ ఆభూములకు ఓనర్లు అయ్యారు.

3 వారం పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో ట్రాఫిక్ డైవర్షన్స్

హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్ పెరిగిపోతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో ట్రాఫిక్ డైవర్షన్స్ కొనసాగుతున్నాయి. వారం రోజులపాటు ట్రయల్ రన్ ఉంటుందని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం.45, జర్నలిస్టు కాలనీ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు వుంటుంది. వాహనదారులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్​ పోస్టు రోడ్ నెం.45 మీదుగా వెళ్లలేరు. జూబ్లీహిల్స్ చెక్​ పోస్టు వెళ్లాలంటే జగన్నాథ టెంపుల్ సర్కిల్ వద్ద రైట్ తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్కు మీదుగా చెక్ పోస్టుకు వెళ్లాలి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్36 మీదుగా మెట్రో పిల్లర్ నం. 1650, రోడ్ నెంబర్ 54 మీదుగా మళ్ళించారు. ఫిల్మ్ నగర్ నుంచి చెక్ పోస్టుకు వెళ్లే వాహనదారులు రోడ్ నెంబర్ 45 వద్ద లెఫ్ట్ తీసుకుని హార్ట్ కప్ కేఫ్ నుంచి కేబుల్ బ్రిడ్జి కింద యూటర్న్ తీసుకుని చెక్ పోస్టుకు వెళ్ళాల్సి వుంటుంది. వారంపాటు ఈ డైవర్షన్స్ ట్రయల్ రన్ నడవనుంది.

4  ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి 56 టిఫా మిషన్లు

 

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి భారీగా ఖర్చుచేస్తోందన్నారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లను ప్రారంభించారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ స్కాన్‌) దోహదం చేస్తుంది. ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే155 ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు ఉన్నాయి. నెలకు సగటున 11 నుంచి 12 వేల పరీక్షలు జరుగుతున్నాయి. టిఫా స్కాన్‌ వల్ల మాత్రమే ఇలాంటివి గుర్తించగలుగుతాం. ఇందుకు గాను, 20 కోట్ల రూపాయలతో 56 టిఫా మిషన్లు సమకూర్చుకున్నాం. దీని కోసం ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాము. ప్రైవేటులో టిఫా స్కాన్‌కు రూ. 2000-3000 వసూలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఈ ఆర్థిక భారం పేదలకు పూర్తిగా తప్పుతుంది. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్బిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. గర్బిణులకు18 నుంచి 22 వారాల మధ్య ఈ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్‌ చేస్తారు. గర్బంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్‌ చేస్తారు.

5 అలా జరిగితే కొత్త ఫోన్ తెస్తానంటున్న ఎలాన్ మస్క్

ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దానికి మార్పులు, సరికొత్త హంగులు దిద్దే పనుల్లో నిగ్నమయ్యాడు. నిషేధించబడిన ఖాతాలను పునరుద్ధరించడం, ఫేక్ ఖతాల్ని తొలగించడం.. లాంటివి చేస్తున్నాడు. వెరిఫై ఖాతాల విషయంలోనూ మరిన్ని చేర్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇలా ట్విటర్‌కు తనదైన మార్క్ ఉండేలా మస్క్ నిమగ్నమవ్వగా.. ఒక యూజర్ అతనికి ఓ వినూత్నమైన ప్రశ్న సంధించింది. దానికి మస్క్ కూడా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చాడు. ‘‘ఒకవేళ ట్విటర్ యాప్‌ను గూగూల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగిస్తే ఏం చేస్తారు? ట్విటర్‌ను నడిపేందుకు మరో కొత్త ఫోన్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తారా? అయినా.. అంతరిక్షంలోకి పంపేందుకు రాకెట్లు తయారు చేసే మస్క్‌కి, సెల్‌ఫోన్ తయారు చేయడం చేత కాదా?’’ అంటూ లిజ్ వీలర్ అనే ఓ యూజర్ ట్విటర్ మాధ్యమంగా ప్రశ్నించింది. ఇందుకు మస్క్ బదులిస్తూ.. ‘‘ట్విటర్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించడమనేది జరగని పని. నేనైతే అది జరగదని కచ్ఛితంగా నమ్ముతున్నాను. ఒకవేళ అలా జరిగితే మాత్రం.. నేను మార్కెట్‌లోకి తప్పకుండా ప్రత్యామ్నాయ ఫోన్‌ని తీసుకొస్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

6 చిత్రసీమలో వీడని విషాదాలు.. నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం పూణేలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం విక్రమ్ మృతి అంటూ వార్తలు రావడంతో ఆయన వాటిపై స్పందిస్తూ తాను బావున్నాను అని చెప్పారు. అప్పుడు ఆయన మాట్లాడేసరికి అనారోగ్యం నుంచి ఆయన కోలుకున్నారని అనుకున్నారు. కానీ, గత రెండు రోజుల నుంచి విక్రమ్ ఆరోగ్యం క్షీణించిందని, వైద్యులు చికిత్స అందిస్తుండగానే విక్రమ్ కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

7 8న ఏపీలో బీసీల సదస్సు.. ఎజెండా అదే

బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా.. బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సైతం హాజరయ్యే అవకాశం ఉందన్నారు.. ఇక, బీసీల గురించి ఎన్నికల ముందు నుంచే ఆలోచించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని.. బీసీ వర్గాల జీవన విధానంలో మార్పులు తీసుకుని రావటానికి జగన్ ఒక డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి.. 139 బీసీ కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చి సంక్షేమ ఫలాలను అందించారన్న ఆయన.. కాలానుగుణంగా వచ్చే మార్పులను బట్టి ఇంకా ఏం చేయాలన్న అంశాలపై అధ్యయనం చేస్తాం అన్నారు.

8 ‘రియల్’ ఇండియా.. సగ భాగం ఆఫీసులదే

పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం వల్ల కొంత మందగమనం నెలకొన్నప్పటికీ.. ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మంచి పనితీరే కనబరిచిందని.. కొలియర్స్‌ ఇండియా రిపోర్ట్‌ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు.. అంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో.. మన దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు.. గతేడాదితో పోల్చితే 18 శాతం పెరిగి.. 3 పాయింట్‌ 6 బిలియన్‌ డాలర్లకు చేరాయని తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌లోకి మూలధన ప్రవాహం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని కొలియర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఒకరు చెప్పారు. జోరుగా సాగుతున్న ఇళ్ల కొనుగోళ్లే ఈ ట్రెండ్‌కి నిదర్శనమని, దేశీయ పెట్టుబడిదారులు సైతం ఈ రంగంలో తమ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుతున్నారని వెల్లడించారు. జనవరి-సెప్టెంబర్‌ మధ్య కాలంలో వచ్చిన పెట్టుబడుల్లో 18 శాతం డొమెస్టిక్‌ ఇన్వెస్టర్లవేనని, ఇది.. పోయినేడాదితో పోల్చితే 4 శాతం ఎక్కువని నివేదిక పొందుపరిచింది.