కాంగ్రెస్ కు దేశద్రోహి అనే సిద్ధాంతం…..రాహుల్ పై సింధియా ఆగ్రహం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ద్రోహి భావజాలం కలిగి ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. దేశానికి వ్యవతిరేకంగా పని చేయడమే ఆ పార్టీ ఒక పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఒక విజన్ లేకుండా ముందుకు పోవడం రాహుల్ కు మాత్రమే చెల్లిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటంగా కాంగ్రెస్ అభివర్ణిస్తున్నదని మంత్రి అన్నారు. రాహుల్ ఏం చెప్పదల్చుకున్నారో ముందు దేశానికి చెప్పాలని హితవు పలికారు. దేశానికి వ్యవతిరేకంగా మాట్లాడటమే సిద్ధాంతంగా మార్చుకున్న ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని సింధియా వ్యాఖ్యానించారు. పరువు నష్టం కేసులో దోషిగా రాహుల్ గాంధీని తేల్చిందని, ఇదే సమయంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకు రావడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వెనుకబడిన వర్గాలను అవమానించారని, ఆపై దేశం కోసం పని చేస్తున్న సాయుధ బలగాల స్థైర్యాన్ని అనుమానించారని ధ్వజమెత్తారు. ఇక వీరికి దేశం పట్ల గౌరవం ఉంటుందని ఎలా అనుకోగలమని సింధియా ప్రశ్నించారు.
జగనన్న పాపాల పథకం పోలవరం ప్రాజెక్ట్
ఏపీలో జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటన అనంతరం రెండు పార్టీ నేతల మధ్య వార్ పీక్స్ కి చేరింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీపై, సీఎం జగన్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేసేందుకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసిందన్న నాదెండ్ల.త్వరలో పోలవరం ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ వెళ్తారని నాదెండ్ల వెల్లడించారు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తును కలిశాం.పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరంపై తెలిసిన కొన్ని విషయాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.పునరావాసం ఖర్చును తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నం.పునరావాసం మొత్తాన్ని పెంచుతామని హామీని అమలు చేయకుండా ఉండేందుకు పోలవరం ఎత్తును తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.పోలవరం ఎత్తు తగ్గించేందుకు ప్రభుత్వం సంతకాలు చేసిందా..? లేదా..? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి.పోలవరం నిర్మాణానికి సంబంధించి ఖర్చులు రీ-ఇంబర్స్ చేస్తామని కేంద్రం చెప్పినా.. పనులెందుకు చేపట్టడం లేదు.
ఇక స్వచ్ఛతపైనే మోహన్ బాబు వర్శిటీ ఫోకస్
ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్ యాజమాన్యాలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం శుభ్రంగా ఉంటుంది. మొదట మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రారంభించాం.. ఇది ఇక్కడితో ఆగదు అన్నారు నటుడు మంచు విష్ణు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీలో స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశ గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంచు విష్ణు . ఆయన జయంతి రోజున ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి, మోహన్ బాబు యూనివర్సిటీలోని 20 వేల మంది విద్యార్థులతో చెత్త సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భారతీయులు విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతం చాలా డర్టీగా ఉండడం బాధాకరమైన విషయం.ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవపోవడం వల్ల ఇండియాకు మచ్చ తీసుకొస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యతో పాటు దేశభక్తిని నేర్పిస్తున్నాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్ డే రోజున మాత్రం దేశభక్తి పాటించడం చేయకూడదు. మార్పు తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అన్నారు మంచు విష్ణు. మోహన్ బాబు యూనివర్సిటీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని 20వేల మంది విద్యార్థులతో చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబియు ఛైర్మన్ మంచు మోహన్ బాబు, సిఈఓ మంచు విష్ణు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు.
తండ్రి కాబోతున్న రానా.. మిహీక పోస్ట్ వైరల్..?
దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండే రానా 2020 లో తన సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి తాను ప్రేమించిన మిహీక బజాజ్ తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. మిహీక ఒక బిజినెస్ విమెన్. నిత్యం సోషల్ మీడియాలో తన వర్క్ తో పాటు ఫ్రెండ్స్ తో ఛిల్ల్ అయిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రానా- మిహీక మీద రూమర్స్ కూడా కొత్తేమి కాదు. మిహీక ప్రెగ్నెంట్ అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ, అవేమి నిజం కాదని, అలా జరిగినప్పుడు తామే అభిమానులకు చెప్తామని ఈ జంట రూమర్స్ కు చెక్ పెట్టారు. అప్పటినుంచి ఇలాంటి రూమర్స్ మళ్లీ పుట్టలేదు. అయితే తాజాగా మిహీక పోస్ట్ చేసిన వీడియోతో మరోసారి ఈ వార్తలు మొదలయ్యాయి. బీచ్ ఒడ్డున ఒక లూజ్ డ్రెస్ లో చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది మిహీక. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ తో ఉన్నట్లు కనిపిస్తుంది అం నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఆ లూజ్ డ్రెస్ లో బేబీ బంప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు.. రానా దంపతులకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్లే ఈ జంట ఈసారి కూడా క్లారిటీ ఇస్తుందా.. లేక చరణ్- ఉపాసన లా తీపి కబురు చెప్తుందా అనేది చూడాలి.
జగన్ కి మిగిలింది 8నెలలే
ఏపీలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అంటున్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు ప్రారంభమైందని….వచ్చే ఎన్నికల్లో 160సీట్లుతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు. అనుమతి లేకుండా ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు అతికిస్తే తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపు ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది 8 నెలలు మాత్రమే అన్నారు అచ్చెన్నాయుడు…..అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులకు కబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర సర్వీసులు నుంచి వచ్చిన అధికారుల చర్యలన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని వాళ్లేవరు తప్పించుకోపోయే అవకాశం లేదన్నారు అచ్చెన్న.తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం విశాఖలో ప్రారంభమైంది. విశాఖలో జరుగుతున్న జోన్-1 క్లస్టర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆరు జిల్లాలు 34 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, బూత్ స్థాయిలో బలోపేతంపై నిర్ధేశం చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా ఓటర్ వెరైఫికేషన్ వీలైనంత త్వరగా పూర్తి చెయ్యడం సహా కొత్త నమోదులపై ఫోకస్ పెట్టాలని చర్చ జరిగింది. తద్వారా ప్రతీ నియోజకవర్గ పరిధిలో 5నుంచి 10శాతం ఓటింగ్ పెంచుకోవలనేది నిర్ధేశం. నిత్యం ప్రజల్లో ఉండేందుకు తద్వారా పార్టీకి సమన్వయం చెయ్యడం సాధ్యం అవుతుందనేది టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
అకాలవర్షాలతో బెంగళూరు విలవిల.. నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో వరదలు
బెంగళూరును అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో వరదలు వచ్చాయి. బెంగళూరు మెట్రో వైట్‌ఫీల్డ్ లైన్‌లో కొత్తగా ప్రారంభించిన నల్లూర్‌హళ్లి స్టేషన్ మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్లాట్‌ఫారమ్‌పై టికెటింగ్ కౌంటర్ దగ్గర వరద నీరు చేరింది. ఈ మెట్రో స్టేషన్‌ను ప్రధాని మోడీ రెండు రోజుల క్రితమే ప్రారంభించారు. వరద నీటిలో మునిగిన మెట్రో స్టేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ట్విటర్ వినియోగదారులు నల్లూరుహళ్లి మెట్రో స్టేషన్‌ను వరదలు ముంచెత్తడంతో చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేశారు. అసంతృప్తులైన పలువురు ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో వ్యవస్థ వినియోగానికి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. పనులను సరిగ్గా పూర్తి చేయకుండానే హడావుడిగా మెట్రో స్టేషన్లు ప్రారంభించారని విమర్శలు గుప్పించారు.
కిక్ ఇచ్చిన క్వార్టర్-4 ఫలితాలు
దేశీయ ఈక్విటీ మార్కెట్ ఇవాళ బుధవారం లాభాలతో ప్రారంభమై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై కనిపించకపోవటం గమనించాల్సిన అంశం. దీంతో.. ఇంట్రాడేలో కూడా లాభాలు కొనసాగాయి. గత ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో వ్యాపార రంగం ఆరోగ్యవంతమైన ఫలితాలను కనబరచటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును రేపు పెంచనుందనే వార్తల నేపథ్యంలో ఆర్థిక రంగ సంస్థల షేర్ల వ్యాల్యూ పెరిగింది. సెన్సెక్స్ 582 పాయింట్లు పెరిగి 59 వేల 689 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 17 వేల 557 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు లాభాల బాట పట్టాయి. మిగతా 10 కంపెనీలు నష్టాలు చవిచూశాయి.రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ బాగా రాణించింది. ఈ రంగం ఒక శాతం లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో ఇండెక్స్‌లు డౌన్ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 4 శాతం ర్యాలీ తీశాయి. మార్చి క్వార్టర్‌లో లోన్ బుకింగ్స్ గ్రోత్ అవటం కలిసొచ్చింది. మరో వైపు.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ విలువ ఒక శాతం పడిపోయింది.
రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు
ఢిల్లీలో మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ గెలుపులో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఓపెనర్లిద్దరూ వెనువెంటనే ఔటవ్వడంతో.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా విఫలమైనప్పుడు.. సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి, తన జట్టుని గెలిపించుకున్నాడు. ఇతనికి విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ కూడా మద్దతిచ్చారు కానీ.. ఒకవేళ సాయి లేకపోతే గుజరాత్‌కి ఈ గెలుపు దాదాపు అసాధ్యం. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ, అతడు ఆచితూచి ఆడుతూ.. లక్ష్యం దిశగా జట్టుని తీసుకెళ్లాడు. ఎట్టకేలకు తన జట్టుని గెలిపించుకొని, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలోనే సాయి సుదర్శన్‌పై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఒత్తిడి సమయంలో అతడు ఆడిన ఇన్నింగ్స్.. నిజంగా మెచ్చుకోదగినదని.. మాజీలు సహా క్రికెట్ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చేరిపోయాడు. అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
శ్రీవల్లీ.. ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నావా.. ?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నేడు తన 27 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికను పాన్ ఇండియా హీరోయిన్ గా మార్చింది పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక పేరు మారుమ్రోగిపోయింది. శ్రీవల్లీగా అమ్మడి నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రగా మారిపోయింది. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్, రష్మిక డీ గ్లామరస్ గా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి ఇంటర్వ్యూల్లో రష్మిక.. ఈ సినిమాలో శ్రీవల్లీగా కనిపించడానికి తనకు చాలా మేకప్ వేశారని, నల్లగా కనిపించాలని స్పెషల్ మేకప్ వేసినట్లు చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టే ఆమెకూడా కష్టపడినట్లు తెలిపింది. ఇక ఈ సినిమా తరువాత రష్మిక.. శ్రీవల్లీగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లినా సామి సామి స్టెప్ వెయ్యడం రష్మికకు అలవాటుగా మారిపోయింది. మొన్న జరిగిన ఐపీఎల్ స్టేజిమీద కూడా అమ్మడు పుష్ప సాంగ్స్ కు స్టెప్పులు వేసి అదరగొట్టింది.