NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

తొడగొట్టి.. మీసం మెలేసి.. మంత్రి ధర్మాన రూటే సపరేటు

మంత్రి ధర్మాన ప్రసాదరావు రూటే సపరేటు.. గత కొద్దికాలంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు తన వ్యవహార శైలితో, డైలాగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. వెరైటీ డైలాగులతో విపక్షాలపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన హంగమా అంతా ఇంతా కాదు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలకు లంచం డబ్బులు అడిగేవారు. నేడు తాము ఎక్కడా అవినీతికి పాల్పడడంలేదు. సినిమాల్లో హీరోలు, విలన్లు తొడగొట్టి సవాళ్ళు విసురుకున్నట్టుగా తొడగొట్టి మీసం మెలేసి సవాలు విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సంక్షేమ పథకాలలో అవినీతి జరొగిందని నిరూపించగలరా.?మత్యకారులు ఎన్నో మార్పులు చేశాం గతంలో ఇలాగే ఉండేదా మత్యకారులు పరిస్థితి..మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి. టీడీపీ వస్తే ఉండవు….చంద్రబాబుని నమ్మేతే మీరు మోస పోయినట్లే . మేము చెబుతున్నాము ప్రజలు నుంచి ఒక రూపాయి తీసుకోలేదు అన్నారు ధర్మాన.

సిక్కింలో హిమపాతం.. అనేక మంది పర్యాటకులు దుర్మరణం!

గ్యాంగ్‌టక్‌ను త్సోమ్‌గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. హిమపాతం కింద చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసేందుకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నప్పటికీ ప్రాణనష్టం భయంకరంగా ఉంది.సుమారు 30 మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు ప్రాథమిక అంచనా.గాంగ్‌టక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని 17వ మైలు సమీపంలో మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ విపత్తు జరిగింది. సిక్కిం పోలీసులు, ఆర్మీ, ప్రభుత్వ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. హిమపాతం కింద చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసేందుకు సహాయ, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

మాజీ ప్రియుడి హత్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి పాతిపెట్టిన మహిళ

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య కేసు తరహాలోనే చెన్నైలో ఓ యువకుడిని మాజీ ప్రియురాలి హత్య చేయడం సంచలనంగా మారింది. దారుణంగా హత్య చేయడమే కాకుండా 400 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని ముక్కలు చేసి పాతిపెట్టింది. చెన్నై పోలీసులు ఆ మహిళను భాగ్యలక్ష్మిగా గుర్తించారు. ఆమె మాజీ ప్రియుడి హత్య కేసులో నిందితులకు సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు ఎం.జయంతన్‌గా గుర్తించారు. 29 ఏళ్ల జయంతన్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ ఎయిర్‌వేస్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 18న స్వగ్రామం విల్లుపురం వెళ్లిన జయంతన్ తిరిగి రాకపోవడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని సోదరి ఫిర్యాదు చేసింది. దీంతో జయంతన్‌ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసును పోలీసులు చేధించారు. కేసు దర్యాప్తులో భాగంగా జయంతన్ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేశారు. ఈ మిస్సింగ్ కేసును మర్డర్ మిస్టరీగా పరిగణించారు. జయంతన్ హంతకుడు మరెవరో కాదని, అది అతని మాజీ ప్రియురాలు భాగ్యలక్ష్మి అని నిర్ధారించి, ఆమెను అరెస్టు చేశారు.

హౌరాలో రామనవమి ర్యాలీ.. పిస్టల్ తో ఒక వ్యక్తి హల్ చల్

శ్రీరామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి పిస్టల్ తో హల్ చల్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమబెంగల్ లో జరిగింది. హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా 22 ఏళ్ల యువకుడిని మంగళవారం పిస్టల్‌తో పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు సుమిత్ షా హౌరా జిల్లాలోని సాల్కియా ప్రాంత నివాసి. బీహార్‌లోని బంగల్మా జిల్లాలో ఉన్న అతని బంధువుల ఇంటి నుండి అతన్ని పట్టుకున్నారు. షా యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను హిందూ మతపరమైన ఊరేగింపులో ఉత్సాహంతో తన పిస్టల్‌ని ఊపుతూ నృత్యం చేయడం చూడవచ్చు. మార్చి 30న, హౌరా నగరంలో రామనవమి శోభా యాత్ర ఊరేగింపు చేపట్టినప్పుడు రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది, అక్కడ అనేక వాహనాలు తగులబెట్టబడ్డాయి. దుకాణాలను ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా, హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించేందుకు ప్రయత్నించినందుకు బిజెపిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందించారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారిని విడిచిపెట్టబోమని అన్నారు. హనుమాన్ జయంతిని జరుపుకునే గురువారం(ఏప్రిల్ 6) రాష్ట్రంలో మరో రౌండ్ హింసకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని పేర్కొంది.

కాంగ్రెస్ -బీఆర్ఎస్ ల మధ్య పొత్తుపై రేవంత్ కామెంట్స్

కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్‌ గురించి రేవంత్ మాట్లాడారు. ఎంఐఎంకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మూడు పార్టీల మధ్య జరుగుతోందన్నారు. ప్రచారంలో ముగ్గురు ఉంటున్నారని.. ఎన్నికల్లో ఇద్దరే అవుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు. 80 శాతం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఆంధ్ర అభివృద్ధి చాలా ఉందన్నారు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది అనుకున్నామని.. కానీ తెలంగాణలో స్వేచ్ఛ లేదని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ధర్మ గంట ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా దర్బార్ లేదన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే పోతారు అని.. అందుకే పార్టీకి 80 సీట్లు ఇస్తారని ఆశిస్తున్నా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

సిలికా శాండ్‌ కుంభకోణంపై విచారణ జరపాలి

నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ కుంభకోణంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. నెల్లూరు సిలికా స్కాం మరో ఓబుళాపురం స్కాం అంటూ సోమిరెడ్డి విమర్శలు.వేలాది కోట్ల రూపాయల లావాదేవీలపై జీఎస్టీ ఎగవేశారని.. సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్.సిలికా అక్రమాలు, జీఎస్టీ ఎగవేతలపై నిర్మలా సీతారామన్ కు లేఖ రాస్తానన్నారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున సిలికా శాండ్ స్కాం జరుగుతోంది.నెల్లూరు జిల్లాలో మరో ఓబులాపురం తరహా కుంభకోణం.కర్నూలు జిల్లాలో అనుమతులు తీసుకుని.. నెల్లూరు జిల్లాలో తవ్వకాలు జరుపుతున్నారు.కర్నూలు జిల్లాలో సిలికా శాండ్ క్వాలిటీ ఉండదు.. అందుకని కర్నూల్లో అనుమతులు తెచ్చుకుని నెల్లూరులో తవ్వుతున్నారు.గతంలో సిలికా శాండ్ లీజు దారులను బెదిరించారు.రూ. కోట్లాది రూపాయల్లో పెనాల్టీలు వేశారు.టన్నుకు రూ. 100 మాత్రమే లీజుదారుకిచ్చి.. మిగిలినదంతా దోచుకుంటున్నారు.టన్ను రూ. 1485కు అమ్ముకుంటూ జీఎస్టీ రూ. 700కే కడుతున్నారు.ఏపీఐఐసీ భూముల్లో అక్రమంగా సిలికా శాండ్ తవ్వకాలను జరుపుతోంటే ఆగింది.ఇప్పుడు 300 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు రెండు కోట్ల టన్నులు ఎత్తేశారు. ప్రభుత్వ, కోస్టల్ కారిడార్, అసైన్డ్, సాగర మాల భూముల్లో మొత్తంగా 3 వేల ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.హైదరబాదుకు నెలనెలా రూ. 27 నుంచి రూ. 30 కోట్లు మామూళ్లు వెళ్తున్నాయి.విజయసాయి రెడ్డికి ముడుపులు వెళ్తున్నాయి.వైసీపీలో చేరిన నెల్లూరు మేయర్ భర్త అతి పెద్ద లీజుదారుడు.. అతనికి రూ. 120 కోట్ల మేర పెనాల్టీలు వేశారు.నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు మీద పెనాల్టీలు వేస్తున్నారు.78 మంది లీజుదారులు బయటకు వచ్చి పోరాడొచ్చు కదా..? అని సోమిరెడ్డి అన్నారు.

జగన్.. మీరైతు భరోసా కేంద్రాలన్నీ బోగస్
జగన్ రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గోపాలపురం గ్రామంలో మొన్న వచ్చిన తుపాన్ దాటికి నష్టపోయిన మొక్కజొన్న తోటలను పరిశీలించారు టిడిపి నాయకులు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శావల దేవదత్. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అనే చెప్పుకొనే జగన్ కి రైతులు బాధలు తెలియవా ? జగన్ రెడ్డి మీ రైతు భరోసా కేంద్రాలు అన్ని భోగస్ మీరు ఏ రైతును ఆదుకున్నారు.
2019 లో జగన్ రెడ్డి నువ్వు తిరువూరు వచ్చినప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు,వినగడప బ్రిడ్జీ కట్టావా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తాడేపల్లి పరదాల చాటున ఉండే ముఖ్యమంత్రి జగన్ కాస్తా బయటకు వచ్చి రైతులు పడే బాధలు చూడు. ముద్దులు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు వారికి వాతలు పెడుతున్నాడు. నువ్వు కట్టించిన రైతు భరోసా కేంద్రాలు పెద్ద బోగస్ వాటి ద్వారా ఎవరికి న్యాయం చేసావు చెప్పాలన్నారు. అకాల వర్షాలు, తుఫాన్ల దాటికి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్నారు.

మామిడికాయలు తింటూ మెగా డాటర్ పోజులు .. ఏమయినా విశేషమా?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మంచి బిజీగా మారింది. గత కొన్నిరోజుల నుంచి నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై మెగా కుటుంబం కానీ, నిహారిక కానీ స్పందించలేదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాకు కొంచెం గ్యాప్ ఇచ్చిన నిహారిక గత వారం నుంచి యమా యాక్టివ్ అయ్యి కనిపించింది. నిత్యం తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది అన్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రెడ్ కలర్ లంగా వోణి, ముక్కుకు ముక్కెర పెట్టుకొని ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవికాస్తా నెట్టింట వైరల్ గా మారే. ఇప్పుడిప్పుడే మెగా డాటర్ కొద్దిగా సోషల్ మీడియామీద ఫోకస్ పెడుతుందని నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి మరో ఫోటోషూట్ తో నిహారిక కవ్వించింది. అందమైన పింక్ కలర్ చీర.. దానిపై బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్.. ముక్కుకు ముక్కెర పెట్టుకొని అదరగొట్టింది. ఇక పుల్లటి మామిడికాయ ముక్కను తింటూ రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను మొత్తం కలిఫై ఒక వీడియోగా తయారుచేసి పోస్ట్ చేసింది.