ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఫైర్.. సీఎస్ కి లేఖ
ఏపీలో ఇసుక మాఫియా ఎక్కువైందని టీడీపీ నేతలు విమర్శిస్తూనే వున్నారు. ఆధారాలతో బయటపెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని మండిపడుతున్నారు. తాజాగా సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాలు సార్లు ఫిర్యాదు చేశాం.అయినా ఆయా ఫిర్యాదులపై తగు రీతిలో స్పందించి చర్యలు తీసుకోలేదు.ఇప్పుడు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.అధికార వైసీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు.అనుమతించిన దానికి మించి జయప్రకాష్ వెంచర్స్ ఇసుక తవ్వకాలకు చేస్తోంది.ఇక్కడ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది.
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండగా.. సాయంత్రం మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని ప్రజలు ప్రైవేట్ వాహనాల కంటే మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. మెట్రో స్టేషన్ల వద్ద జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ స్టేషన్ ముంబై మెట్రో స్టేషన్లను పోలి ఉంటుంది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ముఖ్యమైన రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను అందుబాటులో ఉంచారు. ఈ షార్ట్ లూప్ ట్రిప్పుల వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా రైళ్ల కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులు నడుస్తాయి. ముఖ్యంగా రాయదుర్గం వెళ్లే మెట్రో చాలా రద్దీగా ఉంటుంది. దీంతో అమీర్‌పేట-రాయదుర్గం కారిడార్‌లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి 7 నిమిషాలకు ఒక రైలు నడుస్తుండగా.. ఆ సమయాన్ని తగ్గించారు. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు.
బీజేపీ ఎంపీకి దోమలు కుట్టాయని ట్రైన్ ను ఆపేసిన అధికారులు
ఓ ఎంపీ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఆయన్ని దోమ కుట్టింది. రైలు సిబ్బందికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆ రైలు ఆగిపోయింది. రైలు ఆపేసిన సిబ్బంది ఆదరాబాదగా ఎంపీ దగ్గరకు వచ్చి బోగీ మొత్తం క్లీన్ చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి రైలు తిరిగి బయలుదేరింది. ఎంపీనే కాదు సాధారణ ప్రయాణికుల్ని కూడా రైల్లో దోమలు కుడుతుంటాయి. కానీ సిబ్బంది పట్టించుకుంటారా.. అబ్బే అంత సీన్ ఉండదు. కానీ ఆయన ఎంపీ.. పైగా అధికార పార్టీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అందుకే సిబ్బంది అంత హడవిడి చేశారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటే ఉత్తర ప్రదేశ్ లోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్ వీర్ సింగ్. ఆయన ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న గోమతి ఎక్స్ ప్రెస్ లోని ఏసీకోచ్ లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ రాజ్ వీర్ సింగ్ ను దోమలు కుట్టాయి. ఆయనకు నిద్రాభంగం కలిగింది. దీంతో ఆయన అనుచరుడు మాన్ సింగ్ కు బాధేసింది. అయ్యో మాసార్ని దోమలు కుట్టాయి నిద్ర పోకుండా చేశాయని ఫీల్ అయిపోయి ఆ విషయాన్ని ట్వి్ట్టర్ లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది అని ట్వి్ట్ చేశాడు.
జగనన్నే మా భవిష్యత్తుకి విశేష స్పందన
దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాలు చేపడుతున్నామని, అందుకే ప్రజల నుంచి వైసీపీ పాలనకు ప్రశంసలు లభిస్తున్నాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. మెగా పీపుల్స్ సర్వేకి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇప్పటికే కోటి 60 లక్షల కుటుంబాలను పార్టీ శ్రేణులు కలిశాయి. ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరించాం. అందరూ కలిసి కట్టుగా పని చేశాం. నెల్లూరు జిల్లాలో విజయవంతంగా చేస్తున్నాం అన్నారు మంత్రి కాకాణి. ఎవరి జోక్యం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.అర్హత కలిగిన వారికి సచివాలయం ద్వారా పథకాలు ఇస్తున్నాం అన్నారు. సీఎం జగన్ వల్ల మంచి కలిగిందని ప్రజలు చెబుతున్నారు. ప్రజల్లో స్పందన చూసి టిడిపి నేతలకు నిద్ర రావడం.లేదు. కొన్ని మీడియాలను అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలు..సానుభూతి పరులు కూడా ప్రభుత్వ పథకాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఏడాది నుంచి ధైర్యంగా ఇంటింటికీ వెళుతున్నాం అన్నారు మంత్రి కాకాణి. పార్టీలకు అతీతంగా ఇవాళ పథకాల వర్తింపు అన్నది చేస్తున్నాం. కనుక విమర్శలు మానుకోండి.
సూడాన్ బాధితులకి అండగా నిలబడదాం
సూడాన్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. స్వస్థలాలు చేరేంతవరకూ అండగా నిలవాలన్నారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వారికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు చేరుకునే వరకు అండగా నిలవాలన్నారు సీఎం జగన్. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా. మరోవైపు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా సూడాన్ లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. సూడాన్ లో చిక్కుకున్న తెలంగాణ వారిపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం…ఆపరేషన్ కావేరి లో భాగంగా భారత్ తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ ప్రజలు ఉంటే వారికి సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ తెలంగాణ భవన్ లో అధికారులతో సమీక్ష జరుపుతున్నారు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.
40 మంది మహిళలకు ఒక్కడే భర్తట.. ఎక్కడంటే?
40 మంది మహిళలకు ఒక్కడే భర్తట.. వారి పిల్లలకు అతనే తండ్రికూడనట.. ఒకే ప్రాంతానికి చెందిన 40 మంది మహిళలు చెప్పింది విన్న అధికారులు షాక్ కు గురయ్యారు. బీహార్ లోని అర్వాల్ లోని వార్డు నంబర్ 7లో 40 మంది మహిళలు తమ భర్త పేరును రూప్ చంద్ అని చెప్పారు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్వాల్ లోని వార్డ్ నంబర్ 7లో సెక్స్ వర్కర్లు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. బీహార్ లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు అర్వాల్ లోని వార్డు నంబర్ 7కు వచ్చారు. వివరాలు సేకరిస్తున్నారు. దీంతో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో రెడ్ లైట్ ఏరియాకు వచ్చిన అధికారులు వివరాలు సేకరిస్తుండగా.. అక్కడ నివసించే 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్ చంద్ అని చెప్పారు. వీరిలో చాలా మంది వారి పిల్లలకు తండ్రి రూప్ చంద్ అనే చెప్పారు.
తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో మూడోరోజు జేసీ దీక్ష
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎప్పుడూ వార్తల్లో వుంటుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో సోమవారం నుంచి నిరసనకు దిగారు మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన చేపట్టిన దీక్ష 3వ రోజుకి చేరుకుంది. ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్స్ తో దీక్ష చేస్తున్నారు జేసీ. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల తీరును, కమిషనర్ అక్రమాలను నిరసిస్తూ ప్రభాకర్ రెడ్డి మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపైనే దీక్షకు దిగారు. రోడ్డుపైనే స్నానం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని కౌన్సిలర్లు హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున చేరుకున్నారు.
కమల్ ఆఫర్ ని తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండో భాగం ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బుకింగ్ ప్రారంభం కావడంతో టిక్కెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. ఆదిత కరిగలన్ పాత్రలో నటించిన నటుడు విక్రమ్, ఇటీవల జరిగిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ప్రమోషన్ ఈవెంట్‌లో కమల్ హాసన్ సినిమాలో ఎందుకు నటించలేదో వివరించాడు. ఎంజీఆర్ నుంచి కమల్‌హాసన్ ‘పొన్నియన్ సెల్వన్’ హక్కులు పొందారు. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి ‘పొన్నియన్ సెల్వన్’ నవలను టీవీ సిరీస్‌గా తీయాలనే ఆలోచనలో ఉన్నానని, అందులో ఎలాంటి పాత్రనైనా ఎంచుకోమని ఆఫర్ ఇచ్చినట్లు విక్రమ్ తెలిపారు.కానీ తనకు టీవీ సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదని, ‘పొన్నియన్ సెల్వన్’ నవలను సినిమాగా తీస్తే ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా నటించేందుకు సిద్ధమని విక్రమ్ తెలిపాడు. అయితే అదే సమయంలో ‘పొన్నియన్ సెల్వన్’ కథలో ఎలాంటి పాత్రనైనా ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇచ్చినందుకు కమల్ హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండవ భాగం అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని చిత్ర బృందం అంచనాలు వేస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్ ప్రభు, ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, పార్థిబన్, ప్రకాష్‌రాజ్, రఘుమాన్, కిషోర్, అశ్విన్, షాడోస్ రవి, రియాస్ ఖాన్, లాల్, మోహన్ రామన్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ 2′కి AR రెహమాన్ సంగీతం అందించారు.
నేను నోరు విప్పితే సమంత తల ఎక్కడ పెట్టుకుంటుందో
హీరోయిన సమంత నిర్మాత చిట్టిబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత చిట్టిబాబు మరోసారి సమంత మీద మండిపడ్డారు. ఇటీవల సమంత ఆయనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కి చిట్టిబాబు కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల చిట్టిబాబు సమంతను టార్గెట్ చేశారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నాను అనేది అంతా ఓ నాటకం. సింపథీతో సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటుందని అన్నారు. ఆమె మీడియా ముందు ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరని చిట్టిబాబు అన్నారు. సమంత స్టార్ డం ఎప్పుడో పోయింది. బతకడానికి వచ్చిన ఆఫర్స్ అన్నీ రిజెక్ట్ చేయకుండా చేసుకుంటూ పోతుంది. ఆమెకు గ్లామర్ పోయింది. శాకుంతలం మూవీకి సమంతను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు ? అలాంటి పాత్ర ఆమె ఎలా చేయగలదు? అందుకే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటూ సమంత పట్ల చిట్టిబాబు అసహనం వ్యక్తం చేశాడు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందించారు. చిట్టిబాబు మీద ఒక సెటైర్ పోస్ట్ విడుదల చేశారు. చిట్టిబాబుకు చెవుల్లో వెంట్రుకలు ఉండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… జనాలకు చెవిలో వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్ లో సెర్చ్ చేస్తే… టెస్టోస్టిరాన్ అధికం కావడం వలన అని చూపించింది, అని ఒక పోస్ట్ పెట్టింది. దీనిపై చిట్టిబాబు తాజాగా స్పందించారు. సమంతను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ‘ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారు. అదే నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు.
3 రోజులు కాలేజీకి.. 3 రోజులు కంపెనీకి. నెలకి 10 వేల శాలరీ
రిలయెన్స్ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తోంది. మొన్న.. ఐస్‌క్రీమ్‌ల బిజినెస్‌లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఈ సంస్థ.. ఇప్పుడు.. పిల్లలు ఆడుకునే బొమ్మల తయారీలోకి సైతం అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిలయెన్స్ రిటైల్ కంపెనీ.. సర్కిల్ ఇ రిటైల్ అనే సంస్థతో కలిసి కంబైన్డ్ కంపెనీని ఏర్పాటుచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్కిల్ ఇ రిటైల్ అనేది హరియాణాకు చెందిన సంస్థ. రిలయెన్స్ ఇప్పటికే బ్రిటన్ బొమ్మల కంపెనీ హామ్లేస్‌తో మరియు దేశీయ బొమ్మల సంస్థ రోవన్‌లను కలిగి ఉంది. అమెరికా మాదిరి చదువులు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. అక్కడ స్టూడెంట్స్ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సంపాదిస్తుంటారు. అలాగే.. ఇక్కడ కూడా డిగ్రీ విద్యార్థులు వారంలో మూడు రోజులు కాలేజీకి, మూడు రోజులు కంపెనీకి వెళ్లే విధానానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారం తీసుకుంది. తద్వారా.. స్టూడెంట్స్ డిగ్రీ ఫస్టియర్ నుంచే నెలకు 10 వేల రూపాయల వేతనం తీసుకునే అవకాశం అందుబాటులోకి వస్తోంది.