చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 2019 ఎన్నికల తర్వాతనే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆవరణంలో కొత్తగా ఏర్పాటు చేసిన గార్డెన్ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Tirumala : కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 10 గంటలు..
2019 ఎన్నికల కంటే ముందుగానే ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చివరికి ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019లో భారీ మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, అలాగే ప్రభుత్వాధికారులు అనేక కారణాలు చెబుతూ ఆయన విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేయకుండా తొలగించారు. దాంతో అప్పటినుంచి నగరంలో విగ్రహం లేకుండా పోయింది.
IND vs PAK: నేడే హాయ్ వోల్టాజే మ్యాచ్.. జోరుమీదున్న టీమిండియాను పాక్ ఆపగలదా..
ఇకపోతే తాజాగా టిడిపి కూటమి 2024 లో భారీ విజయం సాధించడంతో మరోసారి టిడిపి ప్రభుత్వం మరోమారు అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో.. టిడిపి పార్టీ శ్రేణులు ఆదే స్థలంలో మరోసారి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు గాంధీ విగ్రహం సెంటర్ లో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో విగ్రహం నెలకొల్పారు టీడీపీ శ్రేణులు