మాస్ హీరో ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడుతున్నారట. ఇప్పటివరకు నీల్ తీసిన సినిమాలన్నింటికంటే ఇది ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ పవర్ ఫుల్ మ్యూజిక్ ఇస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read : Rakul Preet: బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా.. చాలా అవమానాలు ఎదురుకున్న
అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో ఈ యాక్షన్ విస్ఫోటనం మొదలవనుంది. ఎన్టీఆర్ మాస్ మేనియాకు, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌లోనే కీలకమైన సీన్లను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ టీమ్‌కు చెందిన ప్రజ్వల్ గౌడ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందట.
