గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీఆర్ స్టిల్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే..
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే చాలా రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది.. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు..
అక్కడి సినిమా వాళ్లు ఎన్టీఆర్‌కి పార్టీ ఇచ్చారు. ప్రముఖ నటుడు అక్బర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.. తాజాగా ఎన్టీఆర్ మరోసారి ముంబై కు వెళ్లాడు.. ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ షర్ట్, జీన్స్ లో మెరిశారు. మాస్ లుక్ లో ఎన్టీఆర్ సూపర్ గా ఉన్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ఫ్యాన్స్ వాటిని నెట్టింట మరింత వైరల్ చేస్తున్నారు.. ఒక లుక్ వేసుకోండి..