బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3.. టైగర్ 3 మూవీ బిగ్గెస్ట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది… యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి… ఈ మూవీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ ఎంట్రీ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు గా తెలుస్తోంది. హాలీవుడ్‌లో మార్వెల్ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో..బాలీవుడ్‌లో YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్‌కు అంతే క్రేజ్ ఉంది. అయితే YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మరో మూవీ వార్ 2.
వార్ 2 లో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2025 లో విడుదల కానుంది. అయితే..వార్2 ద్వారా YRF స్పై యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్.. ఆ సినిమా కంటే ముందుగానే రా ఏజెంట్‌గా పరిచయం కాబోతున్నట్లు సమాచారం.టైగర్ 3 క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చే ఎన్టీఆర్ పాత్ర మళ్లీ వార్2 లో ఫుల్ లెంగ్త్ ఉంటుందని సమాచారం… ఇదే విషయాన్నీ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ మరియు ట్రేడ్ అనలిస్ట్ లు కూడా వెల్లడిస్తున్నారు… మరి ఈ విషయం గురించి యశ్ రాజ్ ఫిలింస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.టైగర్3 మూవీ లో సల్మాన్ ఖాన్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ భారీ స్థాయిలో వున్నాయి… టీజర్ చూసిన సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఎంతో ఖుషీ అవుతున్నారు. ‘టైగర్ 3’ దీపావళికి నవంబర్ 12న హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ భారీగా కలెక్షన్స్ రాబడతాడని ఇప్పటి వరకు వున్న అన్ని రికార్డ్స్ క్రాస్ చేస్తాడని సల్మాన్ ఫ్యాన్స్ ఎంతో ధీమాగా వున్నారు..