NEET Exam: రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Exam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సూచించిన నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగా చేరుకుంటే మంచింది. పరీక్ష కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని నగరాల్లో ఒకటే పేరు మీద పీజీ, యూజీ కాలేజీలు ఉంటాయి. కాబట్టి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే మంచింది.
మరి ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు మాత్రం నిబంధనలు మరిపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం.
Also Read
*పరీక్షకు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతో పాటు.. ఏదైనా ఓ గుర్తింపు కార్డుని కచ్చితంగా తీసుకువెళ్లాలి. దీంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకెళ్లాలి
*అభ్యర్థులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్ వస్తువులను లోనికి అనుమతించరు.
*షూస్, ఎక్కువ ఎత్తున్న శాండిల్స్ వేసుకోకూడదు. తక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే ఉపయోగించాలి.
*పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్‌డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.
*చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు.
*మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ఫోన్లు, పేజర్స్, హెల్త్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకెళ్లకూడదు.
*అభ్యర్థులు పరీక్ష రాసేందుకు బాల్ పాయింట్ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!