Varun Chaudhary: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికలకు ముందు NSUIలో పెద్ద కుదుపు చోటుచేసుకుంది. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వరుణ్ చౌదరిని తొలగించారు. వాస్తవంగా ఈ మార్పు ఒక్కసారిగా జరిగింది కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయనకు ఇతర ఆఫీస్ బేరర్లతో విభేదాల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వరుణ్ చౌదరి తీసుకున్న నిర్ణయాలతో జాతీయ కమిటీలోని చాలా మంది అసంతృప్తితో ఉన్నారని NSUI ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా NSUI కొత్త జాతీయ అధ్యక్ష పదవికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తదుపరి జాతీయ అధ్యక్షుడిని నియమించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
READ ALSO: కవిత ఘటనపై బీఆర్ఎస్ నేతలతో కెసీఆర్ అత్యవసర సమావేశం
NSUI జాతీయ అధ్యక్ష పదవికి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని జాతీయ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ సమన్వయకర్తలు, విద్యార్థి నాయకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ తేదీ, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫారమ్ నింపి న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలోని డాక్టర్ అన్షుల్ త్రివేది (AICC జాతీయ సమన్వయకర్త)కి వ్యక్తిగతంగా సమర్పించాలని సూచించారు.
సెప్టెంబర్ 18న DUSU ఎన్నికలు..
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికలు సెప్టెంబర్ 18న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన ఒక రోజు తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని విశ్వవిద్యాలయం తెలిపింది. నామినేషన్ పత్రాల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. వార్షిక రుసుముగా రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్, రూ.లక్ష బాండ్ పేపర్ సమర్పించాలి. నామినేషన్ పత్రాల పరిశీలన అదే రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల వరకు నామినేట్ చేయబడిన అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు.
READ ALSO: Never Ducked In ODIs: వన్డే కెరీర్లో ఎప్పుడూ డకౌట్ కానీ ఆ నలుగురు.. లిస్ట్‌లో మనోడు కూడా ఉన్నాడు!