Government Jobs: తెలంగాణ ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు శుభవార్తలు చెబుతూనే ఉంది.. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తుంది.. ఇక, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.. ఇక, ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుదిగడువుగా ప్రకటించింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.. అంటే ఆగస్టు 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు.. సెప్టెంబర్ 19వ తేదీన సాయంత్రం 5 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు..
Read Also: TS Rains: రానున్న రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక, హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ మేళా కొనసాగుతుందంటూ తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్వీట్ చేశారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిందని పేర్కొన్న ఆయన.. అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీల ప్రకారం.. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల కోసం mhsrb.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Job mela in Health Medical & Family Welfare Department continues.. Notification for filling 1520 vacancies of Multi Purpose Health Assistant (Female) under Commissioner of Health & Family Welfare was released by Medical Health Services Recruitment Board.
Good luck to all the…— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2023