ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ప్రజాస్వామ్యంలో సరైన ప్రజానీతినిధిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి భారతీయుడికి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరిగే శాసనసభ తో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం అనేక మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. ఇకపోతే ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎన్నికల్లో పోటీ చేసేవారు తమకి నచ్చకుంటే ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించే అధికారాన్ని కూడా కల్పించింది. ఇందుకోసం ఓటర్ తన ‘నోట’ తో మన ఓటును తిరస్కరించుకోవచ్చు.
Also read: Flipkart: ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు డెలివరీ చేసిన ఫ్లిప్ కార్ట్.. ఆపై సారీ అంటూ..?!
ప్రజా ప్రాతినిధ్య చట్టంలో భాగంగా 1961 సంవత్సరంలోనే సెక్షన్ 49 (O) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించినందుకు రాజ్యాంగం వీలు కల్పించింది. ఇందుకోసం అప్పట్లో ప్రొసీడింగ్ అధికారి దెగ్గరికి వెళ్లి ఓ ఫామ్ తీసుకొని తాము అభ్యర్థిని తిరస్కరించామంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేసేలా రూల్స్ ఉండేవి. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో భాగంగా అభ్యర్థులు గుర్తుతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.
Also read: Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!
అభ్యర్థి ఎవరైనా సరే.. ప్రతి ఓటు వారికి విలువైనది. దాంతో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ కు నచ్చకుంటే నోటాను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల కమిషన్. దీంతో చాలామంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి నోటాను వినియోగిస్తున్నారు. ఈ నోటాను సంబంధించి సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెల్లడించింది. దీంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, అలాగే 2018, 2019లో జరిగిన ఎన్నికల్లో నుండి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం జరిగే ఎన్నికలలో కూడా నోటా ఉంది. ఈ బటన్ వత్తడం ద్వారా సదరు ఓటు ఎవరికి పడదు. ఆయన కానీ ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లే ఓటర్.
NOta, elections 2024 election commission, voters