Nota in Second Place: ఉపఎన్నికల్లో విచిత్రం.. నోటాదే రెండో స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nota in Second Place: మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉపఎన్నికలో ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది. మొత్తం 86,570 ఓట్లలో రుతుజకు 66,530 ఓట్లు రాగా, నోటాకు ఏకంగా 12,806 ఓట్లు పడ్డాయి. అంటే 14.79 శాతం ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న మిగతా వారిలో ఎవరికీ 1600కు మించి ఓట్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రాలో శివసేన రెండుగా చీలిపోయింది. ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి రుతుజ బరిలో నిలవగా బీజేపీ, ఏక్‌నాథ్ షిండే వర్గం తమ అభ్యర్థిని ఆ తర్వాత ఉప సంహరించుకుంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూడా రుతుజకే మద్దతు ఇవ్వడంతో పోటీ ఏకపక్షం అయింది. కాగా, ఉద్ధవ్ థాకరే శివసేనకు ఎన్నికల కమిషన్ ‘కాగడా’ గుర్తు కేటాయించింది. ఆ గుర్తుతో బరిలోకి దిగిన రుతుజ లట్కే ఘన విజయం సాధించింది.
Elon Musk: అమెరికా రాజకీయాలపై ట్వీట్ చేసిన మస్క్.. ఏమన్నారంటే?
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
మహారాష్ట్ర విధానసభలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియలో 31.74 శాతం ఓటింగ్ జరిగింది. 19 రౌండ్ల తర్వాత రుతుజా లట్కే అత్యధిక మెజారిటీ 66,530 ఓట్లతో గెలిచారు. అయితే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ 12,806 మంది నోటా బటన్‌ను నొక్కడం గమనార్హం. అంధేరి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్లగా… విపక్ష నేతలు విరమించుకోవాలని కోరడంతో బీజేపీ అభ్యర్థిని వెనక్కి తీసుకుని ఈ ఎన్నికకు పోటీ లేకుండా చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..