విరాట్ కోహ్లీ గత కొన్ని రోజుల వరకు ఫామ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మళ్లీ తన ఫామ్‌కి తిరిగి రావడంతో, చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అతను సచిన్ టెండూల్కర్ యొక్క 100 అంతర్జాతీయ సెంచరీ రికార్డును అధిగమిస్తాడనే నమ్మకాన్ని చూపిస్తున్నారు. 1205 రోజుల నిరీక్షణ తర్వాత, విరాట్ కోహ్లి ఈ నెలలో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ మ్యాచ్‌లో శతకం బాదాడు. చివరకు ఒక టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. బ్యాటింగ్ స్టార్‌కి ఇది 28వ టెస్టు సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికిది 75వది. అతని గత సెంచరీకి, ఈ సెంచరీకి మధ్య 41 ఇన్నింగ్స్‌ల గ్యాప్ ఉంది, అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై వచ్చింది.
Also Read : Expensive Shoe : ఇది మామూలు షూ కాదు.. దీని ధర రూ.164కోట్లు
ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రిని ప్రశ్నించగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కోహ్లికి 100 అంతర్జాతీయ సెంచరీలు చేయడం అంత సులువు కాదని అంగీకరిస్తూనే, స్టార్ బ్యాటర్ అక్కడకు వస్తే అది చాలా పెద్ద విషయం అని చెప్పాడు. 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన వ్యక్తి ఒక్కడే అని అందరూ గుర్తుంచుకోవాలని రవిశాస్త్రి అన్నారు. కాబట్టి, ఎవరైనా దానిని దాటగలరని మీరు చెప్పడం చాలా పెద్ద విషయం… అతనికి ఆడటానికి చాలా క్రికెట్ ఉంది అని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. అతను ఒక ఫిట్ ప్లేయర్, అతను ఆడగలడు.. అటువంటి తరనికి చెందిన ఆటగాడు చురుకైన వేగంతో సెంచరీలు స్కోర్ చేస్తాడు. నా అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లిలో 5-6 సంవత్సరాల క్రికెట్ మిగిలి ఉంది. ఏ ఊహలో చూసినా అది అంత సులభం కాదు. అందుకే ఒక్క వ్యక్తి మాత్రమే ఈ పని చేసాడు” అని స్పోర్ట్స్ యారీతో రవిశాస్త్రి మాట్లాడాడు.
Also Read : CCL 2023 : సీసీఎల్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్.. అదరగొట్టిన అఖిల్