Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఇమ్రాన్ ఖాన్ శాంతి భద్రతల దృష్ట్యా కోర్టుకు హాజరు నుండి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మార్చి 29న ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.
గత ఏడాది ఆగస్టులో తన స్పెషల్ అసిస్టెంట్ షాబాజ్ గిల్‌కు సంఘీభావంగా ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల కస్టడీలో గిల్‌ను హింసిస్తున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో.. జడ్జ్ జేబా చౌదరిని బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ఆమెపై తాను చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆ నాడే ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం తాను బహుశా తన పరిధిని అతిక్రమించి ఉండవచ్చునని, ఆ జడ్జికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నానంటూ ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన సోమవారం కోర్టుకు హాజరు కావలసి ఉంది. కానీ ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు.. ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
Read Also: Bengal Assembly: కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం.. బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ కోర్టుల ఆదేశాలను అనుసరించి, మాజీ ప్రధానిని అరెస్టు చేయడానికి ఇస్లామాబాద్ పోలీసులు వచ్చే 24 గంటల్లో జమాన్ పార్క్‌ను సందర్శిస్తారని జియో న్యూస్ నివేదించింది.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!