Noida dowry murder: నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపాడు… నోయిడాలో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida dowry murder: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతంగా చంపేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో వెలుగుచూసింది. నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపాడని చెప్తున్న చిన్నారి బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హత్య వరకట్నం కోసం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు, అత్తమామలపై కేసు నమోదు చేశారు.
READ ALSO: Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్
Also Read
- CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
- Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా 'జో రూట్' ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
- Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
రూ.35 లక్షల కోసం నూరేళ్ల ప్రాణాన్ని తీశారు..
గ్రేటర్ నోయిడాలోని కస్నా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి డిసెంబర్ 2016లో వివాహం జరిగింది. బాధితురాలి సోదరి కాంచన్ మాట్లాడుతూ.. తాను, నిక్కీ ఇద్దరం ఒకే కుటుంబానికి చెందిన సోదరులను వివాహం చేసుకున్నామన్నారు. తాను రోహిత్‌ను వివాహం చేసుకోగా, నిక్కీ డిసెంబర్ 2016లో విపిన్‌ను పెళ్లి చేసుకుందని తెలిపారు. పెళ్లి జరిగిన నాటి నుంచే తమ అత్తమామలు నిక్కీని రూ.35 లక్షల వరకట్నం కోసం వేధించే వారని, నిక్కీ వరకట్నం తీసుకురాకపోవడంతో ఆగస్టు 21న తన భర్త విపిన్, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టి, మెడపై దాడి చేశారని తెలిపింది. తను స్పృహ కోల్పోయిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని కన్నీటిపర్యంతం అయ్యింది. స్థానికుల సహాయంతో ముందుగా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స ఢిల్లీకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి బాబు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి పిల్లవాడు వీడియోలో మాట్లాడుతూ.. తన నాన్న అమ్మను లైటర్తో కాల్చి చంపాడని చెప్పాడు.
వివాహంలో స్కార్పియో కారుతో సహా చాలా వస్తువులు ఇచ్చామని మృతిరాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. అయినప్పటికీ నిక్కీ అత్తమామలు నిరంతరం రూ.35 లక్షల అదనపు వరకట్నం కోసం తమ బిడ్డను హింసలకు గురి చేయడమే కాక, హత్య చేశారని కుప్పకూలిపోయారు. పంచాయితీ ద్వారా రాజీకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశామని, కానీ తన అత్తమామలు అంగీకరించలేదని వాపోయారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు..
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాస్నా పోలీస్ స్టేషన్ పోలీసులు భర్త విపిన్, బావమరిది రోహిత్, అత్తగారు దయా, మామ సత్వీర్‌లపై కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా గ్రేటర్ నోయిడా ADCP సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. నిందితులను అరెస్టు చేయడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.
READ ALSO: Dharmasthala case: సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..
తాజావార్తలు
-
CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
-
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!