నిన్న జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా.. ఇంగ్లండ్ ఆఫ్ఘాన్ పై ఓడటంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో టెస్టులు ఆడే అన్ని టీమ్ లపైనా ఓడిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ టీమ్ నిలిచింది. ప్రస్తుతం ఐసీసీ కింద మొత్తం 12 జట్లు టెస్టులు ఆడుతున్నాయి. ఈ జాబితాలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. వీటిలో ఇంగ్లండ్ జట్టు మిగతా 11 జట్లపై ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లో ఓటమిని ఎదుర్కొంది.
Amit Shah: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తుంది..
ఇక ఇంగ్లాండ్ జట్టు తొలిసారిగా 1975 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. ఆ తర్వాత 1979లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌పై ఓడిపోయింది. 1983, 1987లో ఆసియా దిగ్గజాలు భారత్, పాకిస్థాన్లపైనా వరుసగా ఓటమిని రుచి చూసింది. ఇక ఆ తర్వాత 1983లోనే న్యూజిలాండ్ చేతిలోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. 1992లో చిన్న టీమ్ అయిన జింబాబ్వే చేతిలోనూ ఘోర పరాజయం పాలైంది. 1996లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపైనా ఓడిపోయింది. 2011లో అయితే బంగ్లాదేశ్, ఐర్లాండ్ వంటి పసికూనలపై ఓడింది. తాజాగా 2023 ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్ కూడా ఇంగ్లండ్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది.
Telangana: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా
ఇదిలా ఉంటే.. ఈ 11 జట్లపై ఓడిన మ్యాచ్ ల్లోనూ ఎక్కువ ఛేజింగ్ లోనే తడబడి ఓటమి పాలు చెందింది. అంతేకాకుండా.. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ వల్ల కాలేదు. ఫాస్ట్ బౌలింగ్ లో సిక్సర్లు, బౌండరీల మోత మోగించే ఇంగ్లీష్ ఆటగాళ్లు.. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. ఓడిన ప్రతీ మ్యాచ్ ల్లోనూ స్పిన్ బౌలింగ్ కారణమనీ చెప్పవచ్చు. మరోవైపు భారత్ లోని పిచ్ లపై స్పిన్ ఆడటమంటే ఇంగ్లండ్ బ్యాటర్లు భయపడుతున్నారు. ఒకప్పుడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంటే భయపడే ఇంగ్లండ్ టీమ్.. ఇప్పటికీ ఆ తప్పును ఎందుకు సరిదిద్దుకోలేకపోతుంది. ఏదేమైనప్పటికీ డిపెండింగ్ ఛాంపియన్ అయి ఉండి, ఒక చిన్న టీమ్ చేతిలో ఓడిపోవడంతో క్రికెట్ ప్రపంచమంతా సర్వత్రా విమర్శలు చేస్తున్నాయి.