మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సైతం ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా సిట్ అధికారులు ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తోపాటు అడ్వకేట్ శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే.. సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అదేసమయంలో సిట్‌సైతం హైకోర్టులో పిటషిన్ దాఖలు చేసింది. అయితే.. సిట్, బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్ల పై హైకోర్టు విచారణ చేపట్టింది. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు వెల్లడించింది. బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు 41 (ఏ)సీఆర్‌పీసీ నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.
Also Read : Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో కూలీ పోటీ.. 10 వేల రూపాయి నాణేలతో డిపాజిట్
బీజేపీ అభ్యర్థనను తోసిపూచిన హైకోర్టు.. సిట్ దర్యాప్తు గొప్యంగా ఉంచాలని సూచించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు ఆదేశించింది. 41 (ఏ) సీఆర్‌పీసీలో అరెస్ట్ చేయడానికి వీళ్ళేదన్న హైకోర్టు… ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. సిట్ దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులకు 41 (ఏ) నోటీసులు సిట్ అధికారులు ఇవ్వాలని, ఢిల్లీ పోలీసులు బీఎల్ సంతోష్ కు సర్వ్ చేస్తారని, తదుపరి విచారణ ను మంగళవారం కు వాయిదా వేసింది హైకోర్టు.