Site icon NTV Telugu

Zakir Naik : మేం ఆయనను పిలువలేదు.. జకీర్ ఖాన్ పై క్లారిటీ ఇచ్చిన ఖతార్

Zakir Naik 1

Zakir Naik 1

Zakir Naik: ఫిఫా ప్రపంచకప్‌ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు పీస్‌ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) అధినేత జకీర్‌నాయక్‌ ను ఆహ్వానించారనే వార్తలపై ఖతార్ వివరణ ఇచ్చింది. దోహాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆయనకు అధికారిక ఎలాంటి ఆహ్వానం అందించలేదని తెలిపింది. జకీర్ ఖాన్ హాజరు కావడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఖతార్ నుంచి ఈ స్పందన వచ్చింది.

Read Also: Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి

వివాదాస్పద టెలివింజెలిస్ట్ జాకీర్ నాయక్ పై మనీ లాండరింగ్‌తోపాటు విద్వేష పూరిత ప్రసంగాలు చేశాడనే ఆరోపణలున్నాయి. మత బోధనల పేరుతో యువతను రెచ్చగొట్టడం, ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడ్డట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పలు కేసులను ఎదుర్కొంటున్నారు. అతని సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ దేశంలో నిషేధించబడింది. ఈ నేపథ్యంలో ఆయన 2016లో భారత్‌ నుంచి పారిపోయి మలేషియాలో ఉంటున్నారు.

Read Also: China Iphone : ఐఫోన్ కంపెనీలో ఆందోళన.. పొట్టపొట్టుగా కొట్టుకున్నరు

ఇదిలావుంటే, ఖతార్‌లోని దోహాలో జరగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌ ప్రారంభ వేడుకల్లో జకీర్‌ వీవీఐపీ గ్యాలరీలో కూర్చున్న దృశ్యాలు టీవీల్లో కనిపించాయి. దీంతో భారత్‌ మండిపడింది. దీనిపై స్పందించిన ఖతార్‌ ప్రభుత్వం అతడిని తాము ఆహ్వానించలేదని, ఎవరో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వివరణ పంపింది.

Exit mobile version