డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. కిరాణా షాపు నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి ఆన్ లైన్ ద్వారానే చెల్లింపుల చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారు అనే ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2000 రూపాయలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది . రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎటువంటి సిఫార్సు లేదని జూలై 22న రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
Also Read:Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయించబడతాయని సభకు తెలిపారు. కర్ణాటకలోని వ్యాపారులకు యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరణ ఇచ్చారు. కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసులు జారీ చేసిందని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం తెలిపారు.
Also Read:AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటనను జోషి చాలా హాస్యాస్పదంగా అభివర్ణించారు. నోటీసు జారీ చేయడంలో రాష్ట్రానికి ఎటువంటి పాత్ర లేదని డికె శివకుమార్ వెల్లడించారు. “చిన్న వ్యాపారులకు జిఎస్‌టి బకాయిల నోటీసులు జారీ చేసింది కర్ణాటక వాణిజ్య పన్ను అధికారులే. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాని ప్రమేయం లేదని నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఇది బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
Also Read:AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి నోటీసులు జారీ చేసి ఉంటే, అనేక ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అవి అందేవి. అయితే, ఇది మరెక్కడా జరగలేదు. ఈ నోటీసులు కర్ణాటకలో మాత్రమే ఎందుకు పంపబడుతున్నాయి?” అని జోషి ప్రశ్నించారు. జీఎస్టీలో రెండు భాగాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు – కేంద్ర ప్రభుత్వం కింద సీజీఎస్టీ (సెంట్రల్ జీఎస్టీ), రాష్ట్ర ప్రభుత్వాల కింద ఎస్జీఎస్టీ (స్టేట్ జీఎస్టీ). జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ. కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది.