Mallu Bhatti Vikramarka: కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కుల గణన పై అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద, రాజ్యాధికారం అంతా కొందరికి వస్తుందని రాహుల్ గాంధీ కుల జనగణన చేద్దాం అన్నారు. చెప్పిన మాట ప్రకారం కుల జన గణన చేస్తున్నామన్నారు. ఇది చరిత్రాత్మక తీర్మానం అన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీ.. దాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతీ ఇంటిని.. కులాలను సర్వే చేస్తామన్నారు. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తామని తెలిపారు.
సర్వరోగ నివారణ లాగా సర్వే ఉంటుందన్నారు. సామాజిక..ఆర్థిక..రాజకీయ మార్పులకు పునాదిగా మారబోతుందని తెలిపారు. మార్పు కోరుకునే వాళ్ళు మద్దతు ఇవ్వాలని కోరారు. సలహాలు ఇవ్వండన్నారు. క్లారిటీ మాకు ఉంది..కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారని కేటీఆర్, కడియం శ్రీహరికి తెలిపారు. కన్ఫ్యూజన్ లేదు..క్లారిటీ ఉందన్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలిపారు. తీర్మానం క్లియర్ గా ఉందన్నారు. ఇల్లు ఇల్లు సర్వే చేస్తున్నామన్నారు. కుల గణన అన్నం..క్లారిటీగా ఉన్నాం.. కన్ఫ్యూజ్ కాకండి అన్నారు. కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నష్టం చేసేలా చేయకండని తెలిపారు. ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకండన్నారు.
Read also: CM Revanth Reddy: అనుమానం ఉంటే సూచనలు ఇవ్వండి.. కుల గణనపై రేవంత్ రెడ్డి..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సర్వే.. దేశంలో సామాజిక, ఆర్థిక మార్పుకు పునాదన్నారు. జనాభా దామాషా ప్రకారం సంపదపంచాలన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వర్గాల వారి సమాచారాన్ని ఇంటింటి సర్వే ద్వారా పూర్తి చేస్తామన్నారు. ఇది మనం భారతదేశ చరిత్రలోనే గొప్పదన్నారు. సంపద రాజకీయం విద్య అధికారం కొన్నిచోట్ల మాత్రమే కేంద్రీకృతమై ఉంది ఇది అందరికీ సమానంగా పంచపడాలి. ఇ దుకు ఒక కార్యక్రమం తీసుకోవాలని అసెంబ్లీ ఎన్నికలవేళ జడ్చర్ల షాద్ నగర్, కరీంనగర్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తుచేసారు.
ఈ కుల గణన దేశవ్యాప్తంగా జరగాలని ముందుగా తెలంగాణ నుంచి ప్రారంభం కావాలని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై క్యాబినెట్లో పూలను కశంగా చర్చించి జనాభా దామాషా ప్రకారం సంపద పంచాలని నిర్ణయించామన్నారు. సర్వే అయిపోయాక అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ సర్వే సర్వరోగ నివారిలా ఉంటుందన్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనినీ తాము చేపడుతున్నామన్నారు.
Gangula Kamalakar: బీసీ గణన ఎలా చేస్తారు? క్లారిటీ ఇవ్వండి..