Nitish Kumar Reddy: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆల్‌రౌండర్ నితిష్ కుమార్ రెడ్డిను తొలి టెస్టు జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మొదటి టెస్టు నుండి తప్పించి అతడిని ప్రస్తుతం జరుగనున్న భారత్ A, దక్షిణాఫ్రికా A వన్డే సిరీస్‌లో పాల్గొనాలని సూచించింది. రాజ్‌కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో నవంబర్ 13 నుంచి 19 వరకు భారత్ A, దక్షిణాఫ్రికా A జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా నితిష్ కుమార్ రెడ్డి భారత్ A స్క్వాడ్‌లో చేరనున్నారు. ఆ సిరీస్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి భారత టెస్టు జట్టుతో రెండో మ్యాచ్‌లో చేరుతారని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ విషయాన్నీ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో నితిష్ రెడ్డి రెండింటి మధ్య తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నాడు. రాజ్‌కోట్ వన్డే సిరీస్ ఆయనకు టెస్టు సిరీస్ ముందు మంచి ప్రిపరేషన్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?
భారత్ A వన్డే జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మనవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), నితిష్ కుమార్ రెడ్డి.
125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి