NTV Telugu Site icon

Nitin Gadkari: ఇకపై టూవీలర్‌తో పాటు రెండు హెల్మెట్‌లు.. కంపెనీలకు కీలక సూచన

Nitin Gadkari

Nitin Gadkari

భద్రతలో భాగమైన హెల్మెట్ ప్రతిఒక్కరు ధరించాల్సిందే. అయితే చాలామంది టూవీలర్ అయితే కొంటున్నారు. కానీ, హెల్మెట్ కొనేందుకు మాత్రం ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలకు కీలక సూచన చేశాడు. దేశంలోని టూవీలర్ తయారీ సంస్థలు ఇక నుంచి తమ వాహనాలతో పాటు రెండు హెల్మెట్‌లను అందించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు రెండు హెల్మెట్స్ ను అందించాలని సూచించారు. ఈ హెల్మెట్లు ISI సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

Also Read:MI vs KKR: సొంత ఇలాకాలోనైనా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తారా?

నితిన్ గడ్కరీ చేసిన ఈ ప్రకటనను టూ వీలర్ హెల్మెట్ తయారీదారుల సంఘం స్వాగతించింది. ఇది కేవలం ఒక నియమం కాదని, దేశ అవసరం అని టీహెచ్‌ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం ఆశాకిరణం అని అన్నారు. నాణ్యమైన ISI హెల్మెట్ల ఉత్పత్తిని పెంచుతామని, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతామని హెల్మెట్ తయారీదారుల సంఘం హామీ ఇచ్చింది.

Also Read:Malaika Arora : స్టేడియంలో క్రికెటర్ తో మలైకా అరోరా.. డేటింగ్ లో ఉన్నారా..?

భారతదేశంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.88 లక్షల మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా 69 వేల మంది మరణిస్తున్నారు. ఇందులో 50 శాతం మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోతే, ప్రమాదంలో తలకు గాయం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. హెల్మెట్ ధరించడం వల్ల తలకు రక్షణ కల్పించడమే కాకుండా, బలమైన గాలి, దుమ్ము నుంచి కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.