Nita Ambani: జూలై 12న ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అనంత్ అంబానీ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి కార్యక్రమం తర్వాత శుభ ఆశీర్వాద్, మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చివరి రోజు మీడియా ముందు మాట్లాడారు. ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ.. రాధిక, ఆనంద్ పెళ్లి సమయంలో మీడియా వారి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు పెళ్లి కార్యక్రమంలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి క్షమించాలి అంటూ రెండు చేతులతో నమస్కరించి వినమ్రంగా మీడియాను ఆవిడ కోరింది.
Fire Accident: హనుమకొండలో అగ్ని ప్రమాదం..
ఇది పెళ్లి ఇల్లు కాబట్టి.. మీరు రేపు మా అతిధిగా రండి.. మీ అందరికీ తాను స్వాగతం పలుకుతున్నట్లు ఆవిడ చాలా ఆనందంగా తెలిపింది. అలాగే చివర్లో మరోసారి మీడియా బృందానికి మొత్తం ధన్యవాదాలు అంటూ సంతోషంగా తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో నీతా అంబానీ కళ్ళు చెదిరిపోయే పింక్ కలర్ చీర కట్టుకొని కనిపించింది. ప్రస్తుతం నీతా అంబానీ క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
Panjagutta PVR: పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం.. ‘కల్కి’ షో నిలిపివేత!
అంత డబ్బు ఉన్నప్పటికీ ఆమె ఎక్కడ అహంకారం చూపలేదని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఆమె డౌన్ టు ఎర్త్ గ్రేట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇక జూలై 14న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులందరూ హాజరయ్యారు.