MBBS in Hindi: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MBBS in Hindi: ఎంబీబీఎస్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. దేశంలో తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం(2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది నుంచి బీటెక్ కోర్సును ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏపీలోని ఒక కళాశాలతో పాటు మొత్తం 14 కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య 20 కి పెరిగింది. తాజాగా హిందీలో ఎంబీబీఎస్ ను అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లోని గాంధీ మెడికల్ కళాశాల, ఛత్తీస్గడ్ లోని బిలాస్ పూర్ లోని అటల్ బిహారి వాజ్ పేయి విశ్వవిద్యాలయం దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి.
Read Also: worlds most flexible girl: ఈ అమ్మాయి ఒంట్లో ఎముకలున్నాయా.. డౌటే..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తమ రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి హిందీలో ఎంబీబీఎస్ కోర్స్ ప్రవేశపెడతామని మధ్య ప్రదేశ్ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ హిందీలో ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను హిందీలో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తామని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. ప్రయోగాత్మకంగా భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో, మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలోనే కోర్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. దేశంలో మొదటిసారి తాము మాత్రమే హిందీలో మెడికల్ కోర్సు ప్రారంభిస్తున్నామని, మాతృభాషలో ఈ కోర్సు బోధిస్తున్న తొలి రాష్ట్రం తమదే అవుతుందని ఘనంగా ప్రకటించారు చౌహాన్. ఈ కోర్సు కోసం ఫిజియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ వంటి కోర్సులను హిందీలో రూపొందిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి కూడా వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై వైద్య రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: China Spy Ship : స్వదేశానికి చేరుకున్న శాటిలైట్ షిప్
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువదించారు. వాటిని ఈ నెల 16న భోపాల్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఈ రెండు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. వాటిలో 15శాతం సీట్లను జాతీయ కోట కింద కేటాయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీయేతర రాష్ట్రాలకు సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్య రంగానికి సంబంధించిన జర్నల్స్, ఇంగ్లీష్‍లోనే పబ్లిష్ చేస్తారని, అందువల్ల హిందీలో సరైన పాఠ్యపుస్తకాలు కనుక్కునేందుకే మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుందని మాజీ వీసీ డా.భరత్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, నిపుణులకే వదిలేయాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..