చైనాలోని కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం రోజుల్లోనే ఉల్లి ధర కిలో రూ.10 పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణం.
స్థానికంగా ఆజాద్‌పూర్ మండి అని పిలువబడే ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అనే చందంగా మారింది ప్రస్తుత ధరలు చూస్తుంటే.. సామాన్యుడి బ్రతుకే ప్రశ్నార్థంగా మారింది. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. టమాటా, పచ్చిమిర్చి ధర ఎన్నడూ లేనంత పెరిగాయి.
మన రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటా ధర పైపైకి దూసుకెళ్తుంది. అయితే, ఇవాళ (శనివారం) టమాట ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో నాణ్యమైన టమాట ధర కిలో 196 రూపాయలకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.