Intermediate Paper Leak : ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్
- ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ వార్తలు
- స్పందించిన జిల్లా కలెక్టర్
- తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు
- అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE: Crime: కాళ్లలో 10 మేకులు.. మహిళ మృతదేహం.. చేతబడి కారణమా..?
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
కాగా… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాతంగా మొదలయ్యాయి. బుధవారం(మార్చి 5) ఉదయం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ 1కు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటల వరకు పరీక్ష జరగగా.. విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక పరీక్ష మొదలయ్యాక 9.05 నిమిషాలకు వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు వాచ్‌లు, సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే..ఈ రోజు(మార్చి 6)న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!