నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న టైమ్‌కి వచ్చేలా కనిపించడం లేదు.
Also Read : Shambala : ఓటీటీలోకి వచ్చేసిన ఆది ‘శంబాల’.. కానీ ఆ యూజర్లకు మాత్రమే!
ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న దర్శకుడు భరత్ కృష్ణమాచారి, కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఫిబ్రవరి రిలీజ్ నుండి ఈ సినిమాను వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? ఫిబ్రవరిలో మిస్ అయితే, ఈ సినిమాను సమ్మర్ కానుకగా మార్చి చివరలో లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ వాయిదా నిజమైతే, త్వరలోనే కొత్త డేట్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.