ఆర్థిక సంక్షోభం కారణంగా తమ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తగ్గించుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఇలా ఉద్యోగులను తొలగించాయి.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది.. స్పోర్ట్స్ వేర్ కంపెనీ నైకీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ ఉద్యోగుల్లో రెండు శాతం లేదా 1,600 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది..
రన్నింగ్, మహిళల దుస్తులు, జోర్డాన్ బ్రాండ్ వంటి విభాగాల్లో పెట్టుబడులను పెంచడానికి కంపెనీ తన వనరులను ఉపయోగిస్తోందని ఉద్యోగులకు అంతర్గత మెమోలో నైక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ డోనాహో తెలిపారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. కంపెనీ ఎవరైతే ఉద్యోగులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం లేదు. కానీ చివరికి నా నాయకత్వ బృందం చెప్పిన దానికి బాధ్యత వహిస్తానని డోనాహో మెమోలో పేర్కొన్నారు.. ఈ నివేదిక ప్రకారం.. స్టోర్లు, డిస్ట్రిబ్యూట్ సౌకర్యాలలోని కార్మికులు, కంపెనీ ఇన్నోవేషన్ బృందంలో పని చేసే వారిని తొలగించే అవకాశం లేదు. కాగా.. మే 31, 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 83,700 మంది కార్మికులు కంపెనీలో శుక్రవారం నుంచి జూన్ వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపారు..
అంతేకాదు మరో మూడేళ్ళల్లో 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులను ఆదా చేస్తామని గత ఏడాది డిసెంబర్ లో నైకీ ప్రకటించిన తర్వాత ఉద్యోగాల కోత ప్రకటన వెలువడింది. పొదుపు సాధించడానికి తమ సంస్థను క్రమబద్ధీకరిస్తామని కంపెనీ పేర్కొంది.. కొంతవరకు సేల్స్ బాగానే ఉన్నా కూడా ఈ కంపెనీ ఉద్యోగులను తొలగించడం పై పూర్తి స్పష్టత అయితే రాలేదు.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఆర్థిక కారణాల వల్ల ఉద్యోగులను తొలగించారు.. ఇక నెక్స్ట్ ఏ కంపెనీ ఉద్యోగుల పై వేటు వేస్తుందో చూడాలి..