Nigerian Drug Mafia: హైదరాబాద్‌లో 2500 మంది నైజీరియన్లు.. ఏ డ్రగ్ కేసు చూసినా వీళ్లే..!
- హైదరాబాద్‌లో దాదాపు 2500 మంది నైజీరియన్లు
- వారిలో 750 మందికి ముగిసిన వీసా గడువు
- కొకైన్, హెరాయిన్, MDMA పిల్స్
- గంజాయి తరలిస్తూ పట్టుబడుతున్న నైజీరియన్స్
- పెళ్లిళ్ల పేరుతో డ్రామా షురూ చేసిన నైజీరియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Nigerian Drug Mafia: హైదరాబాద్‌లో నైజీరియన్లు జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయినా తమను తమ దేశానికి పంపకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఫలితంగా వారి డిపోర్టేషన్ ప్రక్రియ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఇంతకీ నైజీరియన్స్ చేస్తున్న జిమ్మిక్కేంటి? పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అనేది తెలుసుకుందాం.. హైదరాబాద్‌లో దాదాపు 2500 మంది నైజీరియన్లు ఉన్నారు. వారిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కొకైన్, హెరాయిన్, MDMA పిల్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్లు పట్టుబడుతున్నారు. వీరిలో ఎక్కువమంది స్టూడెంట్ వీసాలపై ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని తిరిగి నైజీరియాకు డిపోర్ట్ చేస్తేనే డ్రగ్స్ దందాకు కొంతమేరకు చెక్ పెట్టవచ్చని పోలీసులు భావించారు…
READ MORE: Supreme Court: “నాన్న, నాకు రూ. కోటి ఇస్తేనే మీతో ఉంటా”.. తండ్రికి 12 ఏళ్ల కుమార్తె డిమాండ్
Also Read
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
కానీ ఇక్కడే పోలీసులకు సరికొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తమను హైదరాబాద్ నుంచి డిపోర్ట్ చేయకుండా ఉండేందుకు నైజీరియన్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉండేలా కొత్తగా పెళ్లిళ్ల పేరుతో డ్రామా మొదలు పెట్టారు. లోకల్‌గా ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వారితో కొన్నిరోజులు గడిపి ఆ తర్వాత ఆ అమ్మాయితో వేధింపుల కేసు పెట్టించుకుని జైలుకు వెళ్తున్నారు. తిరిగి బయటకు వచ్చి కేసులు నడుస్తుండడంతో ఇక్కడే ఉంటున్నారు. వారిపై కేసులు ఉండడంతో డిపొర్టేషన్ ప్రక్రియ చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇలా ఎనిమిది మందికి పైగా సిటీలో ఉంటున్నట్లు సమాచారం. వీరిపై 498 A సెక్షన్ కేసులు ఉండడంతో ట్రయల్ పూర్తయి కేసు క్లోజ్ అయ్యే వరకు బయటకు పంపించే పరిస్థితి లేదు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్.. NDPS చట్టం ఉల్లంఘించే విదేశీయులను మన దేశం బహిష్కరించవచ్చు. దేశంలోకి చట్టవిరుద్దంగా ప్రవేశించడం, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి తీవ్రమైన నేరాలకు పాల్పడడం వంటివి చేస్తే బహిష్కరణ అస్ర్తాన్ని వాడవచ్చు. కానీ విదేశీయులపై హైదరాబాద్‌లో కేసులు నమోదైతే వారిని పంపించడం చాలా కష్టం. ఇదే అదునుగా నైజీరియన్లు కొత్త మార్గాల్లో కేసుల్లో ఇరికి ఇక్కడే ఉంటున్నారు. ఇలా ఇప్పటికీ కొన్ని వందల మంది నైజీరియన్సు ఇప్పుడు వరకట్న వేధింపులు, దొంగతనాలు, దోపిడీల కేసులు పెట్టుకొని ఇక్కడే ఉండిపోయి స్వేచ్ఛగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. కానీ వారిని తిరిగి వారి దేశాలకు పంపించే మార్గాలు అన్వేషిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!