Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ma Inti Bangaram OTT Update : సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి తొలి రోజే పాజిటివ్ టాక్ లభించడంతో, ఓటీటీ విడుదల ఎప్పుడు? ఏ ఓటీటీలో ? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మా ఇంటి బంగారం’కు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ముందుగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని నమోదు చేసింది.
తొలి రోజు వసూళ్ల పరంగా ‘మా ఇంటి బంగారం’ కొత్త రికార్డులు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో బలమైన ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సమంత నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో వీకెండ్లో కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా ఓటీటీ హక్కులపై కూడా స్పష్టత వచ్చింది. ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు డిజిటల్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిజిటల్ ప్రేక్షకులు.
Also Read
- Megaverse: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్, రామ్ చరణ్.. నెట్‌ఫ్లిక్స్‌లో మెగా సునామీ!
- Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో 'భోగి' ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
- Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
- Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
ప్రస్తుతం స్ట్రీమింగ్ తేదీని ఆఫీషియల్ గా ప్రకటించకపోయినా, థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత, దాదాపు నాలుగు వారాల వ్యవధిలో ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తున్న ఈ చిత్రం డిజిటల్ గా చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.
- Tags
- #ma inti bangaram
- cinema
తాజావార్తలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
-
Israel Politics: మిడిలీస్ట్‌ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
-
Megaverse: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్, రామ్ చరణ్.. నెట్‌ఫ్లిక్స్‌లో మెగా సునామీ!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!