నిధి అగర్వాల్.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమాకి ముందు ఈ భామ బాలీవుడ్ లో సినిమాలు చేసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు.టాలీవుడ్ లో ఈ భామ సవ్య సాచి సినిమా తరువాత చేసిన సినిమా మిస్టర్ మజ్ను.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కానీ నటన పరంగా నిధి ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకు మొదటి కమర్షియల్ హిట్ ను అందించింది. ఈ సినిమాతో తనలోని హాట్ యాంగిల్ నీ కూడా రుచి చూపించింది.ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు మరియు తమిళ భాషల్లో వరుస గా అవకాశాలు వచ్చాయితమిళ్ లో ఈశ్వరన్, భూమి మరియు కలగ తలైవన్ చిత్రాలను చేసింది. కానీ ఆ సినిమాలు అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తమిళ్ లో ఈ భామకు ఆఫర్స్ తగ్గాయి..ఆ సమయంలో నిధి టాలీవుడ్ లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా `హరి హర వీర మల్లు` వంటి భారీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది . ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాను ఎప్పుడో 2020 సంవత్సరం లోనే ప్రకటించారు.. కానీ, ఇంత వరకు షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ అయితే లేదు..హరి హర వీర మల్లు సినిమా తన కెరీర్ టర్న్ చేస్తుంది అని భావించింది నిధి అగర్వాల్. కానీ ఆమెకు నిరాశే ఎదురవుతుంది ..తాజాగా ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న హర్రర్ కామెడీ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ను దాదాపు ఖరారు చేశారని తెలుస్తుంది..ఈసినిమాకు రాజా డీలక్స్ తో పాటు మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.