NTV Telugu Site icon

NIA Raids: మావోలకు ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా కేసులో ఎన్‌ఐఏ సోదాలు

Nia

Nia

NIA Raids: మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సోదాల్లో కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సంబంధం ఉన్న ఏడుగురు నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేసింది.

Read Also: Deputy CM Pawan Kalyan: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు యువతకు స్ఫూర్తి

ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ ఇద్దర్ని అరెస్టు చేసింది. చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును 2024 సెప్టెంబరులో తీసుకుని ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది. మావోయిస్టులకు పెద్దఎత్తున ఆయుధాలు, ఇతర ఉపకరణాలు సరఫరా చేస్తున్న నెట్వర్క్ ను ఎన్ఐఏ గుర్తించింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు బలగాలను చంపేందుకు కుట్రపన్నినట్టు ఎన్ఐఏ పేర్కొంది.