ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పిలవబడే వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యాప్ వినియోగంలో సౌలభ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు చేస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దానిలో భాగంగా కొత్తగా చాట్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టేటస్ అప్‌డేట్‌లలో లాంగ్ వాయిస్ మెసేజ్‌లను షేర్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ iPhone, Android వెర్షన్‌లకు అందుబాటులో ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇటీవల AI-జనరేటెడ్ ప్రొఫైల్ పిక్చర్, చదవని మెసేజ్ కౌంట్‌ను క్లియర్ చేసే ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లపై పని చేస్తోంది.
READ MORE: Gayatri Gupta: హీరోయిన్లు వారితో సె* చేస్తున్నారు.. సంచలన నిజాలు బయటపెట్టిన నటి
ఇంతకుముందు వాట్సాప్‌లో వినియోగదారులు స్టేటస్ లాగానే వాయిస్ నోట్‌లను 30 సెకన్ల వరకు షేర్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు.. ప్లాట్‌ఫారమ్ వాయిస్ నోట్స్ వ్యవధిని ఒక నిమిషం వరకు పెంచింది. వాయిస్ మెసేజ్‌ను షేర్ చేయడానికి, స్టేటస్ అప్‌డేట్ పేజీలో మైక్రోఫోన్ చిహ్నాన్ని నొక్కి పట్టి వాయిస్ వినిపించాల్సి ఉంటుంది. ఒక నిమిషం నిడివి గల వాయిస్ మెసేజ్‌లను ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్‌లుగా షేర్ చేయవచ్చు. WhatsApp సాధారణంగా దశలవారీగా అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది. కాబట్టి మీ ఫోన్ లో ఈ ఫీచర్‌ని పొందకుంటే.. ముందుగా యాప్‌ను తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ ఫీచర్ రాకపోతే కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.
కాగా.. ఇప్పటికే వాట్సప్ గతంలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. గతంలో వీడియో కాల్స్ లో స్క్రీన్ షేరింగ్ సమయంలో ఫోన్ ఆడియో అవతల వారికి వినిపించేది కాదు. ఇప్పడు వినిపించేలా అప్ డేట్ చేశారు. దీంతో వీడియో కాల్స్ లో స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు ఆడియోను ప్లే చేయవచ్చు. అలాగే ఇంటర్ ఫేస్ ను మరింత మెరుగు పరచడానికి కొత్త ఐకాన్స్ జోడించింది. అలాగే పాస్‌కీ ఫీచర్ మరింత భద్రత కల్పిస్తుంది. ఇటీవలే ఐఓఎస్ లో రోల్ అవుట్ అయిన ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఆరు నెలల తర్వాత వస్తుందని భావించారు. కానీ పాస్‌కీలు ఇప్పుడు ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.