ఒత్తిడి కారణంగా మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు. సరిగ్గా నిద్ర పోలేరు. చేసే పనిపై ఫోకస్ ఉండదు.
ఈ ఒత్తిడిని నివారించాలంటే అతిగా ఆలోచించడం మానేయాలి.
ఒత్తిడి తగ్గాలంటే తగినంత నిద్ర చాలా అవసరం.
స్క్రీన్ సమయం తక్కువ చేసుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్, కెఫిన్ మొదలైన వాటికి దూరంగా ఉండండి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. పుష్కలంగా నీరు త్రాగాలి.
యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి జీవితంలో అలవర్చుకోండి.
మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం మంచిది.
స్నేహితులు, బంధువులను తరచూ కలుస్తూ ఉండండి ఒంటరిగా అస్సలు ఉండొద్దు.
ఉదయాన్నే వాకింగ్ చేయడం, కాసేపు చదవడం అలవాటు చేసుకోండి.
ఇన్ని ప్రయత్నించాక కూడా ఒత్తిడి తగ్గకపోతే వైద్యులను సంప్రదించి మంచి చికిత్స పొందడం మంచిది.