Amaravati Assigned Land Case: అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్.. సీఐడీకి సరికొత్త ఆధారాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Assigned Land Case: గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లను వరుసగా వెలికి తీస్తున్నామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, కేసుల పరంపర మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కేసులో సీఐడీకి సరికొత్త ఆధారాలు చిక్కాయి.. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తూ హై కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ రెండు పిటిషన్లు ఫైల్ చేసింది.. ఈ మేరకు సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారు. ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేసింది.. ఎసైన్డ్ భూములున్న దళితులు, ఇతర బలహీనవర్గాలవారిని అధికార దర్పంతో బలంతో ఏ విధంగా బెదిరించారు.. ఏ విధంగా వాటిని కాజేశారు అనే విషయాలను కృష్ణప్రియ వివరించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Russia Arms Treaty: రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
ఈ నేపథ్యంలో కేసును రీ-ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు సీఐడీ అధికారులు.. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణ ముగియగా తీర్పును హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఎల్లుండి సోమవారం తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
Read Also: Sreeleela: అయ్యో శ్రీలీలకు ఎంత కష్టం వచ్చే!
కాగా, రాజధానిలో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 2021 మార్చి 12వ తేదీన కేసు నమోదు చేశారు.. ఈ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణల మీద అభియోగాలు నమోదయ్యాయి. అయితే, ఈ కేసు విచారణ జరగకుండా 2021 మార్చి 19న హై కోర్టు స్టే విధించింది.. మరోవైపు.. ఈ కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్ మీద విచారణ పూర్తవగా అక్టోబర్ 16 తేదీకి తీర్పు వాయిదా వేసింది న్యాయస్థానం.. ఈ క్రమంలోనే కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ వేయడంతో చర్చగా మారింది.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!