Arms Treaty: రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి నార్త్ కొరియాతో పొత్తుపెట్టుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలవనుందా.? దీనిపైనా US ఏమంటుంది? అనే విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుందాం. వివరాలలోకి వెళ్తే అధునాతన సాంకేతికతతో ఆయుధాలను తయారు చేసుకోగల రష్యాకు ఉత్తర కొరియా 1,000 ఆయుధాల కంటైనర్లను పంపిణి చేసిందని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆరోపించారు.
Read also:solar eclipse: ఈ రోజు సూర్యగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా..?
ఈ విషయం గురించి జాన్ కిర్బీ మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలను పంపడం ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోయడమే అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్న వేళ కిమ్ జోంగ్ ఉన్ ప్యోంగ్యాంగ్ మాత్రం అణు కార్యక్రమాల పైన ఆసక్తి చూపుతున్నాడు అని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తూ ఆయుధాలను రష్యాకు పంపిన ఉత్తర కొరియాను అమెరికా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైట్ హౌస్ సమాచారం ప్రకారం, కంటైనర్లు రైలు ద్వారా నైరుతి రష్యాకు తరలించబడ్డాయి. సెప్టెంబరు 7 నుండి అక్టోబర్ 1 మధ్య ఉత్తర కొరియాలోని నాజిన్ మరియు రష్యాలోని డునే మధ్య కంటైనర్లు రవాణా చేయబడినట్లు US నిర్దిష్ట సమాచారాన్ని అందిస్తూ ఫోటోలను విడుదల చేసింది.