Rohit Sharma: హిట్ మ్యాన్ దెబ్బ.. రికార్డులు అబ్బా.. అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు!
- మూడు భారీ సిక్సర్లు కొట్టి వన్డేల్లో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు
- షాహిద్ అఫ్రిదీ (351 సిక్సర్లు) రికార్డు బద్దలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై మూడు భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనితో పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా.. రోహిత్, కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
Gorakhpur: ఆసుపత్రి పార్కింగ్‌లో బీభత్సం.. విధ్వంసం సృష్టించిన బోలెరో..!
Also Read
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
- Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
ఇక 38 ఏళ్ల రోహిత్, దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ ప్రేనలెన్ సుబ్రాయన్ బౌలింగ్‌లో కౌ కార్నర్ మీదుగా భారీ స్లాగ్-స్వీప్‌తో తన 350వ వన్డే సిక్స్‌ను కొట్టాడు. ఆ తర్వాత బంతికి అదే షాట్‌ను పునరావృతం చేస్తూ షాహిద్ అఫ్రిదీతో (351 సిక్సర్లు) సమానంగా నిలిచాడు. రోహిత్ కేవలం 100 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి ఈ రికార్డును సమం చేయడం విశేషం. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) 645 సిక్సర్లతో అగ్రస్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు.
Andre Russell-IPL: ఐపీఎల్‌కు ఆండ్రీ రస్సెల్ ఆల్విదా.. అయినా కోల్‌కతా జట్టులోనే!
తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే, రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో రికార్డు బద్దలు కొట్టిన సిక్స్‌ను సాధించాడు. ఫైన్ లెగ్ ఫెన్స్ మీదుగా బంతిని లాగి కొట్టడంతో అఫ్రిదీ రికార్డును అధిగమించాడు. గతేడాది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, ఆ ఫార్మాట్లో ఇప్పటికీ 200లకు పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. తన 17 ఏళ్ల కెరీర్లో 151 ఇన్నింగ్స్‌లలో 205 సిక్సర్లను నమోదు చేశాడు. ఇక రోహిత్ ఈ ఇన్నింగ్స్ లో 51 బంతులను ఎదురుకొని 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
తాజావార్తలు
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?