IPL 2024 SRH: కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ తో ఆరెంజ్ ఆర్మీ టైటిల్ సాధిస్తుందా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా కోటీ ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది సన్‌రైజర్స్. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఏకంగా రూ.20.5 కోట్లకు దక్కించుకుని మరీ టీం క్రేజ్ పెంచిన వార్నర్, విలియమ్సన్ ను పక్కన పెట్టి కొత్త కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆసీస్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలపడంతో కమిన్స్ పైనే టీం మానేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు గడిచిన 3 సీజన్లలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచింది సన్‌రైజర్స్. దాంతో ఈ సారైనా టైటిల్ గెలవాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.
మరి ఈ సారి విదేశీ, స్వదేశీ క్రికెటర్ల సత్తాతో రెడీ అయన ఈ ఆరెంజ్ ఆర్మీ టీంకు కొత్త కెప్టెన్ ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఇక టీం బలాల విషయానికొస్తే.. విదేశీ ఆటగాళ్లు సన్‌రైజర్స్ కు కొండంత బలమనే చెప్పాలి. టీం కెప్టెన్ కమిన్స్ తో పాటు మార్‌క్రమ్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, హసరంగ, యాన్సెన్, ఫజల్ హక్ ఫరూఖీ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కమిన్స్ ప్రస్తుతం ఫామ్ లో ఉండడంతో.. పేస్ బౌలింగ్ తో, బ్యాటింగ్ తో సత్తాచాటగలడు. ఎవరికీ కూడా అతడి కెప్టెన్సీ పై సందేహాలు లేవు. హెడ్, మార్‌క్రమ్, క్లాసెన్, ఫిలిప్స్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చగలరు. పేసర్ యాన్సెన్, స్పిన్నర్ హసరంగ అయితే బాల్ తోపాటు బ్యాట్ తోనూ అద్భుతంగా రాణించగలరు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
వీరితోపాటు టీంలో భారత బౌలర్ల స్థానం బలంగా ఉంది. ముఖ్యంగా పేస్ త్రయం నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ కాస్త మంచి ప్రదర్శన చేస్తే జట్టుకు తిరుగుండదనే చెప్పాలి. ఇక భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కూడా మంచి స్పిన్ ఆల్‌రౌండరే. ఇక బలహీనతల విషయానికొస్తే.. టీంలో ఉన్న భారత ప్లేయర్స్ కాస్త ఫామ్ లో లేరని చెప్పొచ్చు. ముఖ్యంగా జట్టులో సమష్టితత్వం లేదనిపిస్తోంది. ముఖ్యంగా జట్టుకు వార్నర్, విలియమ్సన్, మార్‌క్రమ్ ఇంకా ఒకరితర్వాత ఒకరు అంటూ వరుసగా కెప్టెన్లను మార్చడం కూడా జట్టుకు ఓ మైనస్ అనే చెప్పాలి. కాబట్టి అనేక అంచనాల ఒత్తిడిని కమిన్స్ ఎలా అధిగమిస్తాడో చూడాలి మరి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!