Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వే....
- ఏపీ, తెలంగాణ మీదుగా రెండు రైళ్లు ప్రకటన....
- 16 చైర్ కార్ కోచ్‌లతో నడవనున్న రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే వార్తను అందించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ రెండు నూతన ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం కనెక్టివిటీ పెంచడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు.
Also Read:Advance Tax Deadline: అడ్వాన్స్ టాక్స్ లాస్ట్ డేట్ మార్చి 15.. ఎవరు చెల్లించాలి? ఎంత చెల్లించాలి?
Also Read
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
అందులో ఒకటి విశాఖపట్నం – కొల్లాం ఎక్స్‌ప్రెస్ (18501/18502). ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. మార్గమధ్యలో దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 8:50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 5:20 గంటలకు కొల్లాంలో ప్రారంభమై.. గురువారం రాత్రి 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
మరొక ట్రైన్.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (17065/17066). హైదరాబాద్ శివారులోని చర్లపల్లి నుంచి ఈ రైలు మంగళవారం ఉదయం 7:15 గంటలకు బయలుదేరి.. బుధవారం ఉదయం 11:20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి.. గురువారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.
Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
నిర్వహణ కారణాల రీత్యా రాజమండ్రి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే కొన్ని రైళ్లను ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ట్రైన్ నంబర్స్ 07524, 17267, 17268 , 07523 సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ-విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. 16 చైర్ కార్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పండుగలు, సెలవుల సమయంలో ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికులకు ఊరటనిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!