తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. జీవో ప్రకారం.. ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు వందశాతం పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఉంటుందని మంత్రి తెలిపారు.
అలాగే.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే.. ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతాయని చెప్పారు. ఈ క్రమంలో.. ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
Read Also: Mahesh Kumar Goud: ఫోటో షూట్ కోసమే మూసీ నిద్ర.. మూడు నెలలు బస చేయండని సవాల్