Site icon NTV Telugu

New Districts In AP: మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..!

New Districts In Ap

New Districts In Ap

New Districts In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్‌, 20GB RAM, టాప్-నాచ్ స్పెసిఫికేషన్లతో Huawei Mate 80 Series లాంచ్..!

ఇకపోతే, పరిపాలనా పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లు నూతనంగా ఏర్పాటు చేయబడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటు అయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిరలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో జిల్లాల పరిపాలనా వ్యవస్థను మరింత బలపరుస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త జిల్లాల రూపకల్పన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ద్వారా ప్రజా సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాలు అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్ అనంతరం అమల్లోకి రానున్నాయి.

IBomma Ravi Case : ఆ ఒక్క మెయిల్ రవిని పట్టించింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు

Exit mobile version