Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. 9 మంది మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
RGV Reviews: ధురంధర్-2’పై రామ్‌గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!
Also Read
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
- Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
మంటలు తీవ్రంగా వ్యాపించడంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. దాదాపు మూడు గంటల పాటు అగ్ని అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఘటన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. మంటల భయంతో ఇద్దరు వ్యక్తులు భవనంపై అంతస్తు నుంచి దూకగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!
సంఘటన స్థలానికి సుమారు 30 ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అధికారుల ప్రకారం ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
-
Team India: వైభవ్ సూర్యవంశీలా.. ఆ స్టార్ ఆటగాడి కెరీర్‌ను కూడా గంభీర్ నాశనం చేస్తున్నాడు!
-
BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
-
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!