Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!
- పప్పు ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఉండదు..
- తక్కువ సమయంలో స్వీట్ షాప్ స్టైల్ మెత్తటి బొబ్బట్లు తయారు
- ట్రై చేయండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nethi Bobbatlu Recipe: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లలో పిండివంటల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పండుగ సమయాలలో గుర్తొచ్చేది ‘నేతి బొబ్బట్లు’ ఒకటి. అయితే చాలామంది బొబ్బట్లు చేయాలంటే పప్పు నానబెట్టాలి, పిండి నానబెట్టాలి అని గంటల కొద్దీ సమయం కేటాయిస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ సమయం, శ్రమతో అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో మెత్తటి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
పిండి కోసం:
* గోధుమపిండి (1 గ్లాసు),
* మైదా పిండి (1 గ్లాసు),
* ఉప్పు (రుచికి సరిపడా),
* పసుపు (పావు టీస్పూన్),
* నెయ్యి,
* నూనె.
Also Read
Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!
పూర్ణం కోసం:
* శనగపప్పు (1.5 గ్లాసు),
* బెల్లం తురుము (2 గ్లాసులు),
* సోంపు (అర టీస్పూన్),
* యాలకులు (4-5),
* ఎండు కొబ్బరి ముక్కలు (కొద్దిగా),
* నెయ్యి.
తయారీ విధానం:
* పిండిని కలుపుకోవడం:
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా పిండి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా, కాస్త స్టిక్కీగా (జిగురుగా) కలుపుకోవాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పిండిని బాగా మర్దన చేసి మూత పెట్టి పక్కన ఉంచండి.
* ఇన్స్టంట్ పూర్ణం తయారీ:
పప్పు నానబెట్టే పని లేకుండా శనగపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేయండి. ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల చొప్పున (1.5 గ్లాసుల పప్పుకి 3 గ్లాసుల నీళ్లు) నీళ్లు పోయాలి. అందులో కొంచెం ఉప్పు, నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
* ఫ్లేవర్ కోసం స్పెషల్ పౌడర్:
పప్పు ఉడికేలోపు మిక్సీ జార్‌లో సోంపు, యాలకులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది బొబ్బట్లకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది.
* పూర్ణం ఉడికించడం:
ఉడికిన పప్పులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. చల్లారిన తర్వాత పప్పును మెత్తగా గ్రైండ్ చేసి ఒక కడాయిలోకి తీసుకోవాలి. అందులో రెండు గ్లాసుల బెల్లం తురుము వేసి చిన్న మంట మీద ఉడికించాలి. బెల్లం కరిగి మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసుకున్న సోంపు పొడి, కొంచెం నెయ్యి వేసి కలపాలి. మిశ్రమం పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్
* బొబ్బట్లు ఒత్తుకోవడం:
చల్లారిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమంలోంచి కొద్దిగా పిండి తీసుకుని, అందులో పూర్ణం ఉండను పెట్టి క్లోజ్ చేయాలి. బట్టర్ పేపర్ లేదా కవర్ మీద నెయ్యి రాసి, చేత్తో గానీ లేదా చపాతీ కర్రతో గానీ పల్చగా ఒత్తుకోవాలి.
* నెయ్యితో కాల్చుకోవడం:
పెన్నం వేడి చేసి, మీడియం ఫ్లేమ్ మీద బొబ్బట్టును వేసి రెండు వైపులా నెయ్యి అప్లై చేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, మెత్తటి నేతి బొబ్బట్లు సిద్ధం.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!