T20 World Cup: “మేము పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు”.. నెదర్లాండ్స్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత నెదర్లాండ్స్ తీవ్ర నిరాశకు గురైంది. చివరి ఓవర్లలో పేలవమైన ఆటతీరు కారణంగా మ్యాచ్ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో తమను పాకిస్థాన్ ఓడించలేదని.. తామే తమ చేతులతో ఓడిపోయామని నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ వాపోయాడు. వాస్తవానికి.. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో గందరగోళానికి గురైంది. 10 ఓవర్లకే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 90 పరుగులు చేసింది. ఆ దశలో మ్యాచ్ పూర్తిగా పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయినట్టే అనిపించింది. నెదర్లాండ్స్ బౌలర్లు అద్భుతంగా పోరాడారు. వరుసగా వికెట్లు పడటంతో పాకిస్థాన్ 16.1 ఓవర్లకు 7 వికెట్లకు 114 పరుగులకే చేరింది. గెలుపునకు ఇంకా 34 పరుగులు కావాలి. పాకిస్థాన్ టీంలో హిట్ బ్యాట్స్‌మన్స్ లేరు. ఆ సమయంలో పాకిస్థాన్ ఓడిపోవడం ఖాయమనే భావన అందరిలోనూ కలిగింది.
READ MORE: Kidnap Case : మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు నోటీసులు జారీ.. అరెస్ట్ తప్పదా?
Also Read
అయితే అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫహీమ్ అష్రఫ్ పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. కేవలం 7 పరుగుల వద్ద ఈజీ క్యాచ్‌ను నెదర్లాండ్స్ వదిలేసింది. అదే మ్యాచ్ ఆ టీం ఓటమికి కారణమైంది. ఆ తర్వాత అష్రఫ్ రెచ్చిపోయాడు. చివరి రెండు ఓవర్లలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి మ్యాచ్‌ను నెదర్లాండ్స్ చేతుల్లో నుంచి లాక్కున్నాడు. చివరి ఓవర్లో మరో ఫోర్‌తో పాకిస్థాన్ విజయం ఖాయం చేశాడు. అష్రఫ్ 11 బంతుల్లోనే నాటౌట్‌గా 29 పరుగులు చేసి హీరోగా నిలిచాడు. పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి గెలిచింది.
READ MORE: Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాల్ వాన్ మీకెరెన్ తన మనసులో మాట చెప్పాడు. “ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవలేదు. మేమే మమ్మల్ని ఓడించుకున్నాం. చివరి ఓవర్లలో మేం అనుకున్నట్టు బౌలింగ్ వేయలేకపోయాం. వరల్డ్ కప్‌లాంటి టోర్నీల్లో చిన్న చిన్న తప్పిదాలే పెద్ద ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఒకే ఒక బంతి మ్యాచ్‌ను తారుమారు చేస్తుంది. నాకు చాలా బాధగా ఉంది.. మేము కావాల్సినన్ని పరుగులు చేయలేకపోయాం అనేది నిజమే. కానీ పాకిస్థాన్ బ్యాటింగ్‌లో బలంగా కనబడినా మేము కట్టడి చేశాం. ఇది మా జట్టు సంస్కృతి. మేమెప్పుడూ లొంగిపోము. బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాం. నిజంగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్ గెలవాల్సింది మేమే” అని చెప్పాడు. 15 ఓవర్ల తర్వాత పాకిస్థాన్ 123 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశాడు. “ఆ దశలో కూడా మేము ఒత్తిడి తెచ్చాం. కానీ చివరి క్షణాల్లో చల్లగా ఆలోచించలేకపోయాం. పాకిస్థాన్ బాగా ఆడింది. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లింది. అదే వాళ్లకు కలిసొచ్చింది” అని అంగీకరించాడు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!