Nepal: నిరసనకారుల చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్-జెడ్, దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి తెచ్చింది. కానీ ఆమె పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో ఇప్పుడు 54 ఏళ్ల ఇంజినీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుల్మాన్ ఘిసింగ్ ముందంజలో ఉన్నారు. పలు నివేదికల ప్రకారం.. నేపాల్‌లో తాత్కాలిక మంత్రివర్గానికి కుల్మాన్ ఘిసింగ్ నాయకత్వం వహించాలని జనరేషన్ Z వర్గాలు ఒక ప్రకటనలో పిలుపునిచ్చాయి. ఈ ప్రభుత్వంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులతో పాటు జనరేషన్-జెడ్ యువత కూడా ఉండాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Insurance: షోరూంలో వాహనానికి యాక్సిడెంట్ అయితే, ఇన్సూరెన్స్ వస్తుందా..?
ఇంతకీ కుల్మాన్ ఘిసింగ్ ఎవరు..
కుల్మాన్ ఘిసింగ్ 1970 నవంబర్ 25న నేపాల్‌లోని రామెచ్చాప్‌లోని బేతాన్‌లో జన్మించారు. ఆయన తన గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత ఖాట్మండుకు వచ్చి 7వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత ఆయన భారతదేశంలోని జంషెడ్‌పూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. నేపాల్‌లోని పుల్‌చౌక్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2016లో ఆయన NEA అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో నేపాల్‌లో రోజుకు 8 నుంచి 18 గంటల విద్యుత్ కోత ఉండేది. కేవలం రెండు నెలల్లోనే ఆయన లోడ్ షెడ్డింగ్ సమస్యను పరిష్కరించారు. ఆయన నాయకత్వంలో నష్టాల్లో ఉన్న సంస్థ లాభదాయకంగా మారడంతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యతను పెంచింది. విద్యుత్ దొంగతనాన్ని ఆపడానికి, పంపిణీ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి, జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఆయన అనేక ముఖ్యమైన చర్యలు ప్రవేశపెట్టారు.
నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న కుల్మాన్ ఘిసింగ్ ఆ దేశ విద్యుత్ బోర్డు మాజీ అధిపతి. ఖాట్మండు లోయలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ కోతలను ముగించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. మొదటిసారిగా సెప్టెంబర్ 14, 2016న నాలుగు ఏళ్ల కాలానికి ఈ పదవికి నియమించింది. అనంతరం తిరిగి ఆగస్టు 11, 2021న NEA మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మార్చి 2025లో నేపాల్ ప్రభుత్వం నేపాల్ విద్యుత్ అథారిటీ (NEA) మేనేజింగ్ డైరెక్టర్ కుల్మాన్ ఘిసింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. కుల్మాన్ ఘిసింగ్‌కు ఇంధనం, జల వనరులు, నీటిపారుదల శాఖ మంత్రి దీపక్ ఖడ్కాతో విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన తన పదవిని కోల్పోయారని వినికిడి. కుల్మాన్ ఘిసింగ్‌ను నేపాల్ ప్రభుత్వం
‘లోడ్ షెడ్డింగ్ కిల్లర్’..
నేపాల్‌లో కుల్మాన్ ఘిసింగ్ ‘లోడ్ షెడ్డింగ్ కిల్లర్’ గా, ప్రజా సేవకు ఉదాహరణగా ప్రసిద్ధి చెందారు. ఆయన సాధారణ వ్యక్తిత్వం, ప్రజలతో అనుబంధం, ఆవిష్కరణలు ఆయనకు దేశ యువత, సాధారణ ప్రజలలో బాగా పేరు తీసుకొచ్చాయి. తాజాగా ప్రభుత్వ రాజీనామా తర్వాత, కుల్మాన్ ఘిసింగ్‌ను దేశ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమించాలనే వార్త ప్రముఖంగా తెరపైకి వచ్చింది. కుల్మాన్ ఘిసింగ్ ఒక దార్శనిక, ప్రభావవంతమైన ప్రజా నాయకుడు అని, ఆయన నేపాల్‌ను చీకటి యుగం నుంచి బయటకు తీసుకువచ్చి వెలుగును చూపించగలరని అక్కడి యువత ఆశిస్తుంది.
READ ALSO: China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!