Fuel Price Hike: షాకింగ్.. రాత్రికి రాత్రే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Price Hike: గత నెలగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దక్షిణాసియా దేశాలపై పడుతోంది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు మరోసారి పెరిగాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15 నేపాలీ రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం.. కేటగిరీ 1 ప్రాంతాలలో లీటరు పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ 2 ప్రాంతాలలో రూ.186, కేటగిరీ 3 ప్రాంతాలలో రూ.187గా ఉంది. డీజిల్, కిరోసిన్ ధరలు కేటగిరీ 1 ప్రాంతాలలో లీటరుకు రూ.164.50, కేటగిరీ 2 ప్రాంతాలలో రూ.166, కేటగిరీ 3 ప్రాంతాలలో రూ.167కు పెంచారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.
READ MORE: Strait of Hormuz: భారత్ కు ఊరట.. హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
గత 15 రోజుల్లో తమకు సుమారు 5 బిలియన్ల నేపాలీ రూపాయల నష్టం వాటిల్లిందని, ఈ కారణంగానే ధరల పెంపు అనివార్యమైందని ఆ కార్పొరేషన్ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అందిన తాజా రేట్ల జాబితా ఆధారంగానే కొత్త ధరలను నిర్ణయించినట్లు తెలిపింది. పూర్తిగా ఆటోమేటెడ్ ధరల విధానం ప్రకారం ధరలను నిర్ణయించడం ఇంకా సాధ్యం కాదని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. నేపాల్‌లో నెల రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ నిరంతర ధరల పెరుగుదల ప్రజలపై, రవాణా రంగంపై, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందనే భయాలను పెంచింది.
READ MORE: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!